Home / Weather Report
మాండౌస్ తుఫాను చెన్నైకి 30 కిలోమీటర్ల దూరంలోని మామల్లపురంలో శుక్రవారం రాత్రి 10.30 నుండి 11.15 గంటల మధ్య తీరాన్ని తాకింది.
ఈశాన్య రుతుపవనాలు తమిళనాడు, పుదుచ్చేరి, కోస్తా ఆంధ్ర ప్రదేశ్ మీదుగా ప్రవేశించినందున హైదరాబాద్‌లో రానున్న మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తెలంగాణలో శీతాకాలం ప్రారంభంలోనే, విపరీతంగా చలి ఉంది. రాష్ట్ర రాజధానిలో పగటి ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగానే ఉంటుంది. గతంలో 19-21 డిగ్రీల సెల్సియస్‌గా ఉన్న రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత ఇప్పుడు 16 డిగ్రీల సెల్సియస్‌కి పడిపోయింది.
రాగల 24 గంటల్లో తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
గత మూడురోజులుగా తెలంగాణాలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాగా రేపు కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచించింది.
ఏపీ వ్యాప్తంగా రెండురోజులు వర్షాలు కురవనున్నాయి. ప్రస్తుతం తూర్పు విదర్భ నుంచి దక్షిణ కోస్తాంధ్ర వరకు ఉత్తర–దక్షిణ ద్రోణి కొనసాగుతోంది. ఇది సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో సోమ, మంగళవారాల్లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది.
తెలుగు రాష్ట్రాల్లో రానున్న రెండు రోజులపాటు భారీ వర్షాలు పడనున్నాయి . ఈ ఏడాది పడిన వర్షాలు ఏ ఏడాది కూడా పడలేదు . ఏవి ఆగిన వర్షాలు ఆగడం లేదు . ఈ ఏడాది ప్రకృతి తన విశ్వరూపం చూపిస్తుంది . రెండు రోజలకొకసారి వాతావరణం మారిపోతూనే ఉంటుంది . తెలుగు రాష్ట్రాల్లో, భారీ వర్షపాతం నమోదు ఐనందున ఎల్లో అలర్ట్ చేసినట్టు తెలిసిన సమాచారం .
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడ్డింది. పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా ప్రాంతంలో కేంద్రీకృతమైంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదిలి.. కొన్ని గంటల్లో తీరం దాటే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో జోరుగా వాన కురుసింది. లంగర్‌హౌస్, గోల్కొండ, కార్వాన్, అమీర్‌పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, కూకట్‌పల్లిలో వర్షం కురిసింది. కాగా, తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
తెలంగాణలో వచ్చే రెండురోజుల్లో చాలా చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణశాఖ తెలిపింది. తూర్పు విదర్భ పరిసర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతున్నది. దీని ప్రభావంతో నేడు, రేపు రాష్ట్రంలో పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.