Home / TRS
మునుగోడులో టికెట్ కోసం నేతలు ప్రయత్నాలు.. అసలు మునుగోడులో ఎం జరుగుతోంది
ఉప ఎన్నికకు సిద్ధమవుతున్న మునుగోడులో టీఆర్ఎస్ నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డికే మళ్లీ అవకాశం ఇవ్వనున్నట్టు టీఆర్ఎస్ నేతలు సంకేతాలు ఇవ్వడంతో పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన రాజకీయ భవితవ్యం పై కొన్ని రోజులుగా జరుగుతున్న చర్చకు ఫుల్స్టాప్ పెట్టారు. కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. త్వరలో స్పీకర్ ను కలిసి రాజీనామా లేఖ ఇస్తానని తెలిపారు. మునుగోడు ప్రజలకు మేలు జరుగుతుందనే రాజీనామా చేస్తున్నానని వెల్లడించారు.
కేసీఆర్ కు అహంకారం తలకెక్కిందని, అందుకే బీజేపీని, ప్రధాని మోదీని ఉద్దేశించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. కేసీఆర్ కు సంస్కారం లేదని, దేశ ప్రధానిని ఉద్దేశించి మాట్లాడే మాటలేనా అవి ఆయన నిలదీశారు.
బీజేపీపై తెలంగాణ సీఎం కేసీఆర్ విరుచుకుపడ్డారు. ప్రదాని మోడీ సభపై విమర్శలు గుప్పించారు. తాను అడిగిన ప్రశ్నల్లో ఒక్క దానికి కూడా మోదీ సమాధానం చెప్పలేదని మండిపడ్డారు. ప్రధాని ఏం మాట్లాడారో ఎవరికీ అర్థం కాలేదని ఎద్దేవా చేశారు. మోదీ.. అవివేక, అసమర్ధ పాలన సాగిస్తున్నారని కేసీఆర్ ఫైర్ అయ్యారు.