Home / Train Accident
పంజాబ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రైలు పట్టాలపై కూర్చుని పండ్లు తింటూ ఉన్న నలుగురు చిన్నారులను రైలు ఢీ కొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు దుర్మరణం చెందారు.
సికింద్రాబాద్ నుంచి వస్తున్న శబరి ఎక్స్‌ప్రెస్(17230)కు పెనుప్రమాదం తప్పింది. రైల్వేట్రాక్‌పై కొందరు దుండగులు అడ్డంగా ఇనుప రాడ్డును కట్టారు. ఇనుపరాడ్డును చూసి వెంటనే అప్రమత్తమైన లోకోపైలెట్ మంజునాథ్ రైలును ఆపేశాడు. దానితో పెను ప్రమాదం తప్పింది.
జార్ఖండ్‌లోని ధన్‌బాద్ డివిజన్‌లో కోడెర్మా, మన్పూర్ రైల్వే సెక్షన్ మధ్య బొగ్గు వ్యాగన్లతో వెళ్లుతున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. 53 బోగీలు బోల్తా పడ్డాయి. వ్యాగన్లలోని బొగ్గు చిందర వందరగా పట్టాలపై పడ్డాయి. కొన్ని వ్యాగన్ల చక్రాలు ఊడి పక్కకు పడిపోయాయి.