Home / Telugu Panchangam
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు.
హిందూమత విశ్వాసాలలో పంచాంగానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అందుకే మన భారతీయులు ఎటుంటి కార్యాలు అనగా శుభకార్యాలు, పండుగలు, కొత్త ఇంట్లోకి ప్రవేశించడం, కళ్యాణం ఇతర ఆచార వ్యవహారాలు చేపట్టాలంటే పంచాంగాన్ని ఖచ్చితంగా చూస్తారు. మరి ఈ పంచాంగం శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు, దుర్ముహుర్తం, యమగండం, రాహూకాలం, సూర్యోదయం, సూర్యాస్తమయం వంటి విషయాలను వివరిస్తుంది.