Home / Komatireddy Venkat Reddy
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై చండూరు సభలో అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పారు. బహిరంగ సభలో అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలు సరికావన్నారు. తాను చేసిన హోంగార్డ్ ప్రస్తావనపైనా రేవంత్ రెడ్డి క్షమామణ చెప్పారు. అద్ధంకి చేసిన వ్యాఖ్యలను బాధ్యత వహిస్తూ తాను సారీ చెబుతున్నానని చెప్పారు.
మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్లబోనని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. పిలవని పేరంటానికి వెళ్లే అలవాటు తనకు లేదన్నారు. చండూరు సభలో తనను అసభ్యకరంగా తిట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖం చూసేది లేదని ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపై ఆయన ఫైరయ్యారు. తనను ఓడించాలని ప్రయత్నించిన వ్యక్తిని పార్టీలో ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించారు.
కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారడంపై తానేమీ స్పందించబోనని ఆయన సోదరుడు భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నేషనల్ హెరాల్డ్ ఆఫీసును ఈడీ సీజ్ చేయడంపై ఢిల్లీలో ఎంపీలు ధర్నా చేశారు. ఈ ధర్నాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు.