Home / Harish Rao
Harish Rao: నిమ్స్ ఆసుపత్రిలో 9మంది చిన్నారులకు గుండె సర్జరీలను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా విదేశాల్లో వైద్య సేవలు అందిస్తున్న వైద్యులకు ఆయన పిలుపునిచ్చారు. సొంత గడ్డపై సేవలు అందించడానికి వైద్యులు ముందుకు రావాలని సూచించారు.
హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీవేంకటేశ్వర వైభవోత్సవంలో మంత్రి హరీశ్రావు కుటుంబ సమేతంగా పాల్గొని శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
యావత్తు దేశంలో పెద్ద చర్చకు దారితీసిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీని జాతీయ పార్టీ గా మారుస్తూ భారత రాష్ట్ర సమితి పార్టీగా జీవం పోసుకొన్న కీలక తరుణంలో మరో వాదం తెరపైకి వచ్చింది. సీఎం కేసిఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ పార్టీ అవిష్కరణ సమయంలో ఆమె గైర్హాజరుపై సర్వత్రా చర్చకు దారితీసింది. నెట్టింట ఎందుకు పాల్గొనలేదనంటూ విభన కధనాలను వ్యాపిస్తున్నారు.
తెలంగాణలో ఈ విద్యాసంవత్సరం 8 మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు ప్రారంభిస్తున్నామని మంత్రి హరీష్ రావు తెలిపారు
తమ రాష్ట్రం గురించి మాట్లాడే నైతిక హక్కు హరీష్రావు, కేసీఆర్కు లేదని ఏపీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ది పై చర్చకు సిద్దమా అని హరీష్రావుకు సవాలు విసిరారు. హరీశ్ రావు గొప్పలు చెప్పుకుంటే చెప్పుకో. మమ్మల్ని పోల్చాల్సిన అవసరం లేదు.
ఓట్ల కోసం జూటా మాట్లాడే పార్టీల మాటలు నమ్మొద్దని మంత్రి హరీష్ రావు కోరారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం ఖమ్మంపల్లి గ్రామంలో 3 కోట్ల 77లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన 60 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంగళవారం ఆయన ప్రారంభించారు.
డెంగ్యూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ ఫీవర్ సర్వే చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు అన్ని మున్సిపాలిటీల్లో డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాలు పెరుగుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
మంత్రి హరీష్ రావు వ్యంగంగా, వెటకారంగా మాట్లాడటం సరికాదు. మంత్రులు అవతలి వారు ఏం మాట్లాడారో జాగ్రత్తగా విని స్పందించాలి అని కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ సూచించారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ కేంద్రం వాటా ఉన్న పథకాలకు కేంద్రం పేరు పెట్టాల్సిందేనని స్పష్టం చేసారు.
కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి ఇబ్రాహీంపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పరామర్శించారు.
రాఖీ పండుగ సందర్భంగా మంత్రి కేటీఆర్ ట్వీట్టర్లో తన చిన్న నాటి జ్జాపకాలను పంచుకున్నారు. కొన్ని బంధాలు ఎప్పటికీ ప్రత్యేకం అంటూ చెల్లెలు కవితతో ఉన్న ఫొటోతో పాటు కూతురు అలేఖ్య, హిమన్షు ల పిక్స్ షేర్ చేస్తూ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు.