Home / CM KCR
మాజీ ఎంపీ, పాలేరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో, ఆఫీస్ లో రెండో రోజు కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఖమ్మంలోని పొంగులేటి ఇళ్లు, కార్యాలయాలతో పాటు హైదరాబాద్ లోని మొత్తం 30 ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. గురువారం తెల్లవారుజామున 4.30 గంటల నుంచి ఈ సోదాలు ప్రారంభం
తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ రాబోయే ఎన్నికల్లో హ్యాట్రిక్ గెలుపు అందుకోవాలని భావిస్తున్నారు. అందుకు గాను అలుపెరగని యోధుడిలా వరుస సభల్లో పాల్గొంటూ ప్రజలతో మమేకం అవుతున్నారు. ఈ క్రమంలోనే నేడు గజ్వేల్, కామారెడ్డి లలో నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా గజ్వేల్ లో నామినేషన్ దాఖలు
తెలంగాణలో నామినేషన్ల ప్రక్రియ జోరందుకుంది. రేపటితో గడువు ముగియనుండగా మంచి రోజు కావడం వల్ల గురువారం నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు పెద్ద ఎత్తున రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఆయా పార్టీల కీలక నేతలు నామినేషన్లు దాఖలు చేయగా, సీఎం కేసీఆర్ నేడు గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు.
గద్వాల చరిత్ర చాలా గొప్పదని అటువంటి గద్వాలను గబ్బు పట్టించిందెవరో ఆలోచించాలని సీఎం కేసీఆర్ అన్నారు. సోమవారం గద్వాల లో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో కరువుతో అల్లాడామని అన్నారు.కాంగ్రెస్ వస్తే కరెంట్ కష్టాలు, కన్నీళ్లు తప్పవని అన్నారు.
ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయి. ఏ పార్టీ చరిత్ర ఏంటో ప్రజలు బాగా ఆలోచించాలి. మీ ఓటు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుంది అని సీఎం కేసీఆర్ అన్నారు. ఆదివారం ఆయన ఖమ్మం, కొత్తగూడెం లో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభల్లో ప్రసంగించారు.
హైదరాబాద్ జలవిహార్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ న్యాయవాదుల సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ న్యాయవాదులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేశారని కేటీఆర్ గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్ధులకు ధీటుగా న్యాయవాదులు పోరాడారని మంత్రి గుర్తుచేశారు.
సోనియా గాంధీ వల్లే తెలంగాణ కల సాకారమైందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణ సాధనలో కాంగ్రెస్‌ది కీలక పాత్రని అన్నారు. తెలంగాణ ఇస్తే ఏపీలో కాంగ్రెస్ బతకదని తెలిసినా తాము రాష్ట్రాన్ని ప్రకటించామని తెలిపారు. శుక్రవారం బషీర్‌బాగ్‌లో జరిగిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు.
ఆరునూరైనా తెలంగాణలో గెలిచేది బీఆర్ఎస్ పార్టీనే అని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. సత్తుపల్లిలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ప్రతిపక్షాలపై కేసీఆర్ విరుచుకుపడ్డారు.
తెలుగు రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధిని కాంక్షిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక యాగాన్ని ప్రారంభించారు. ఎర్రవెల్లిలోని కేసీఆర్ఫామ్‌హౌస్‌లో విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాముల ఆధ్వర్యంలో బుధవారం రాజశ్యామల సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగానికి అంకురార్పణ జరిగింది.
సీఎం కేసీఆర్ మంగళవారం హూజూర్ నగర్, మిర్యాలగూడ, దేవరకొండ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు.ప్రజలు మంచి చెడు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. పార్టీల చరిత్ర, వైఖరిపై చర్చ జరగాలని అన్నారు.