Home / AP Deputy CM Pawan Kalyan
ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఊరేగింపులు జరుపుకోవడం తనకు ఇష్టం ఉండదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలకు పింఛన్లు ఇచ్చి కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికే నియోజకవర్గానికి వచ్చానన్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను టాలీవుడ్ సినీ నిర్మాతలు కలిశారు. నిర్మాతలు అశ్వినీదత్, అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ, యెర్నేని నవీన్, రవిశంకర్, డీవీవీ దానయ్య, భోగవల్లి ప్రసాద్, విశ్వప్రసాద్, నాగవంశీలతో పాటు తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు, కార్యదర్శి దామోదర్ ప్రసాద్ తదితరులు విజయవాడ క్యాంపు ఆఫీసులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలిశారు.
పంచాయతీరాజ్, పురపాలక, వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష జరిపారు. పంచాయతీలు, స్థానిక సంస్థలకు వెళ్లాల్సిన నిధుల మళ్లింపుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులు ఏ మేరకు మళ్లించారో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
రాష్ట్ర ప్రజలకు సేవచేసే భాగ్యం కలిగినందుకు సంతోషంగా ఉందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేసారు.తాను నిర్వర్తించబోయే శాఖలు.. తన మనసుకు, జనసేన మూల సిద్ధాంతాలకు దగ్గరగా ఉన్నాయని పేర్కొన్నారు.