Published On:

Ori Devuda Twitter Review : ఓరి దేవుడా సినిమా ట్విట్టర్ రివ్యూ

Ori Devuda Twitter Review : ఓరి దేవుడా సినిమా ట్విట్టర్ రివ్యూ

Ori Devuda Twitter Review :
విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్, ఆశా భట్ హీరోయిన్లుగా నటించిన తాజా సినిమా ‘ఓరి దేవుడా’.ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ దేవుడుగా కనిపించడం ఇంకో విశేషం.తమిళ వర్షన్‌కు దర్శకత్వం వహించిన అశ్వత్ మారిముత్తు తెలుగులో కూడా ఆయనే తెరకెక్కించారు.ఈ సినిమాను దీపావ‌ళి కానుకగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

తమిళంలో భారీ విజయం సాధించిన ‘ఓ మై కడవులే’ సినిమాకు ఇది రీమేక్. తమిళంలో విజయ్ సేతుపతి చేసిన దేవుడు పాత్రను తెలుగులో విక్టరీ వెంకటేష్ చేస్తుండటం విశేషం. స్టైలిష్ లాయర్‌గా వెంకటేష్ ఈ సినిమాలో కీలకమైన పాత్రలో కనిపించారు.ఇక కథ ఏంటంటే

కథ: ఈ సినిమాలో కథ మొత్తం అజయ్ అనే పాత్ర చుట్టూ తిరుగుతుంటుంది.సినిమాలో ఒక అపరిచితుడు అజయ్ కి భవిష్యత్తులో జరగబోయే విషయాల గురించి అన్ని చెబుతూ ఉంటాడు.అజయ్ ఇంక విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంటాడు.కోర్టులో ఒక అపరిచితుడు అజయ్ కి ఏం జరుగుతుందో ముందే చెప్పేస్తాడు .ఆ అపరిచితుడు ఎవరు, అతడికి ముందే అన్నీ ఎలా తెలుస్తున్నాయి ? అసలు అజయ్ అతనికి ఎలా తెలుసు, అజయ్, అను విడాకుల కోసం ఎందుకు దరఖాస్తు చేసుకుంటారు. చివరికి విడాకులు తీసుకున్నారా ? లేదా ? అనేది కథ.

విశ్వక్ సేన్ ఈ సినిమాలో వేరే లెవెల్లో నటించారు.అతని నటనకు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు వేపించుకున్నారు.సినిమా మొత్తాన్ని విశ్వక్ సేన్ తన భుజాలపై మోసుకెళ్ళాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.ఇక హీరోయిన్ విషయానికొస్తే మిథిలా పాల్కర్ ఆమె తన పాత్రకు పూర్తిగా న్యాయం చేసిందని చెప్పవచ్చు.సినిమా మొత్తం ఎమోషన్స్ తో చూసేటప్పుడు మిగిలిన సినిమాలతో పోల్చుకుంటే కొంచం డిఫరెంట్ అనిపిస్తుంది. ఇతర నటీనటులు వారి వారి పాత్రల్లో బాగానే నటించారు.వెంకటేష్, రాహుల్ రామకృష్ణల నటన ఈ సినిమాకు హైలెట్ గా నిలిచాయి.

ఒక్క మాటలో ఈ సినిమా గురించి చెప్పాలంటే
ఓరి దేవుడా సినిమా మాత్రం చాలా రొమాంటిక్ సినిమా.ఈ సినిమాలో సమయానికి తగ్గట్టు హాస్య సన్నివేశాలు పడ్డాయి.. ఈ సినిమాని అందరూ ఒక్కసారైనా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్: విశ్వక్ సేన్ నటన, స్క్రీన్ ప్లే, సంగీతం,యాక్టర్స్ నటన, బ్యాక్ గ్రౌండ్ స్కోర్
మైనస్ పాయింట్స్ : విజువల్ ఎఫ్ఫెక్ట్స్

ఇవి కూడా చదవండి: