Home / జాతీయం
ఉజ్బెకిస్తాన్‌లోని సమర్ఖండ్లో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్సిఓ) శిఖరాగ్ర సమావేశంలో కనెక్టివిటీని మెరుగుపరచాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చినప్పటికీ పొరుగు దేశం చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ నుండి దూరాన్ని కొనసాగించారు.
నిరసన కార్యక్రమాలు నిర్వహించిన కార్యక్రమాల్లో విచారణ చేపట్టిన సర్వోత్తమ న్యాయస్ధానం పలువురికి జైలు శిక్షలు విధించిన ఘటన అహ్మాదాబాద్ లో చోటుచేసుకొనింది
జమ్ముకశ్మీర్‌కు చెందిన సబ్రినా ఖలిక్ ముగ్గురు పిల్లలకు తల్లైనా టెన్త్ టాపర్ గా నిలిచి వార్తల్లో కెక్కింది. సబ్రినా పెళ్లికి ముందు తొమ్మిదో తరగతి వరకు చదువుకుంది. అయితే అనివార్య కారణాల వల్ల పెళ్లి చేసుకుంది. కానీ పై చదువులు చదువాలన్న కోరిక మాత్రం ఆమె మనసులో అలాగే ఉండిపోయింది.
దేశ ఆర్ధిక సంస్కరణలపై నేటి కేంద్ర ఆర్ధిక మంత్రి, నాటి కేంద్ర ఆర్ధిక మంత్రుల మద్య మాటల యుద్దం ప్రారంభమైంది. మాటకు మాటకు బదులంటూ మాజీ కేంద్ర ఆర్ధిక మంత్రి ట్విట్టర వేదికగా నేటి కేంద్ర ఆర్ధిక మంత్రి కౌంటర్ ఇచ్చారు
సెప్టెంబర్ 17న ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు. ఈసందర్భంగా బంపర్ ఆఫర్ ని ప్రకటించింది ఓ రెస్టారెంట్. ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ లో ఉన్న ఈ రెస్టారెంట్ లో రూపొందించిన ప్రత్యేక తాలీని 40 నిమిషాల్లో లాగించిన వారికి రూ.8.5 లక్షలు ఇస్తామని వెల్లడించింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ యొక్క అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమాలలో ఒకటైన ప్రధాన మంత్రి గతి శక్తి (PMGS) కింద, 22 ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం మొత్తం రూ. 1 లక్ష కోట్లకు పైగా పెట్టుబడికి ఆమోదం లభించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
భారతీయ జనతా పార్టీ (బిజెపి) తమిళనాడు యూనిట్ సెప్టెంబర్ 17 (శనివారం) ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజును పురస్కరించుకుని కొత్తగా పుట్టిన పిల్లలకు బంగారు ఉంగరాలు మరియు 720 కిలోల చేపలను పంపిణీ చేయాలని నిర్ణయించింది.
మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ పార్టీ పంజాబ్ లోక్ కాంగ్రెస్ సెప్టెంబరు 19న బీజేపీలో విలీనం కానుంది. గత ఏడాది చివర్లో సీఎం పదవి నుండి తొలగించిన తర్వాత కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టిన అమరీందర్ సింగ్ కొత్త రాజకీయ పార్టీ- పంజాబ్ లోక్ కాంగ్రెస్ (పిఎల్ సి )ని స్థాపించారు.
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) గుర్తింపును ఉపసంహరించుకునే ప్రక్రియను ప్రారంభించాలని మరియు ప్రభుత్వ ఉద్యోగులను ప్రేరేపించడం ద్వారా ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు దాని చిహ్నాన్ని రద్దు చేయాలని కోరుతూ రిటైర్డ్ బ్యూరోక్రాట్ల బృందం ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) రాజీవ్ కుమార్‌కు లేఖ రాసింది.
ఉత్తర్ ప్రదేశ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. లక్నోలోని దిల్కుషా ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి గోడ కూలిన ఘటనలో తొమ్మిది మంది దుర్మరణం చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నించారు.