Home / జాతీయం
ప్రపంచంలో ఎన్నో మర్మప్రదేశాలు ఉన్నాయి వాటిలో ఇప్పటికీ సైంటిస్టులకు అందని, అంతుచిక్కని రహస్యాలు ఎన్నో దాగున్నాయి. అటువంటి వాటిల్లో ఒకటి తమిళనాడు మహాబలిపురంలో ఒక కొండపై ఏటవాలుగా, జారిపోయేలా ఉన్న రాయి కూడా ఉంది. దీనిలో విశేషమేమంటే ఎంత పెద్ద తుఫాను వచ్చినా ఈ రాయిమాత్రం ఇసుమంతైనా కదల్లేదని అక్కడి స్థానికులు అంటున్నారు. ఇక ఇదే తరహాలో మయన్మార్‌లో కూడా ఒక రాయి ఉంది.
ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో చేరిన నాలుగేళ్ల చిన్నారికి భోజనంలో బొద్దింక రావడం కలకలం సృష్టించింది.
అహ్మదాబాద్‌లోని గుజరాత్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడిచేసి విధ్వసం సృష్టించారు. సీనియర్ నాయకుడు భరత్‌సింగ్ సోలంకీ పోస్టర్లను తగులబెట్టారు.
బిహార్‌లో జన్మించిన ఓ వింత శిశువును స్థానికులు గ్రహాంతరవాసిగా ప్రచారం చేస్తున్నారు.ఎందుకలా అంటున్నారు అంటే శిశువు ముక్కు స్థానంలో రెండు కళ్లు ఉండడమే ఈ ప్రచారానికి కారణం.
రాష్ట్రవిభజన,అమరావతి రాజధాని కేసుల విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 28వతేదీకి వాయిదా వేసింది. అమరావతి పై 8, రాష్ట్ర విభజన పై 28 పిటిషన్లు దాఖలయ్యాయి. రాష్ట్ర విభజన, అమరావతి రాజధాని కేసులను విడివిడిగానే విచారిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.
ఢిల్లీ తీహార్ జైలు సూపరింటెండెంట్ అజిత్ కుమార్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. జైలులో ఉన్న ఆప్ నాయకుడు సత్యేంద్ర జైన్ కు వీఐపీ ట్రీట్ మెంట్ జరుగుతోందన్న ఆరోపణల పై అజిత్ కుమార్ సస్పెండ్ అయ్యారు.
పెట్రోలు, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడానికి కేంద్రం సిద్ధంగా ఉందని, అయితే రాష్ట్రాలు అలాంటి చర్యకు అంగీకరించే అవకాశం లేదని పెట్రోలియం మరియు సహజవాయువు మంత్రి హర్దీప్ సింగ్ పూరి న్నారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలప్రచారానికి వెళ్లిన ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కు షాక్ తగిలింది. ఆయన ప్రచారసభలో ముస్లిం యువకులు ఆయన వ్యతిరేకంగా గో బ్యాక్ నినాదాలు చేసారు.
దేశంలో అత్యంత బలమైన టెలికాం బ్రాండ్‌గా రిలయన్స్ జియో అవతరించింది. ముఖేష్ అంబానీకి చెందిన జియో అత్యంత వేగంగా ప్రజల ఆదరణ పొందింది. ఈ విషయాన్ని బ్రాండ్ ఇంటెలిజెన్స్, డేటా అనాలిసిస్ కంపెనీ టీఆర్ఏ ఓ సర్వే ద్వారా వెల్లడించింది. 'ఇండియాస్ మోస్ట్ డిజైర్డ్ బ్రాండ్స్ 2022' పేరిట టీఆర్ఏ సంస్థ ఓ జాబితాను విడుదల చేసింది.
ఢిల్లీలో ఒక వ్యక్తి తాను సహజీవనం చేస్తున్న మహిళ శరీరాన్ని 35 ముక్కలుగా నరికి 18 రోజుల పాటు అడవిలో పడవేసినట్లు పోలీసులు తెలిపారు. అతను శరీర భాగాలను పడేయడానికి ప్రతిరోజూ తెల్లవారుజామున 2 గంటలకు బయటకు వచ్చేవాడని వారు చెప్పారు.