Kangana Ranaut: మరోసారి కంగనా రౌనౌత్ వార్తల్లో నిలిచింది. ప్రముఖ తెలుగు దర్శకుడి రాజమౌళిని ఏమైనా అంటే ఊరుకునేది లేదంటూ హెచ్చరించింది. రాజమౌళిపై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ పై ఈ బాలీవుడ్ భామ.. ఘాటుగా స్పందించింది. రాజమౌళిని జాతీయవాదిగా, యోగిగా అభివర్ణిస్తూ.. పొగడ్తలతో ముంచేత్తింది. ఆయనపై విమర్శలు మానుకోవాలని హితవు పలికింది. ఇంతకి ఏం జరిగిందో తెలుసా?
World has stamped controversial on him for what? What controversy he did? He made a film called Bahubali to glorify our lost civilisation, or he made nationalistic RRR? Or he wore dhoti to international red carpets? What controversy he did ? Please tell me https://t.co/T06aZk3GuW
— Kangana Ranaut (Modi Ka Parivar) (@KanganaTeam) February 18, 2023
మత వివాదంలో రాజమౌళి..
టాలీవుడ్ దర్శకదీరుడు.. తెలుగు సినిమాను ప్రపంచ స్థాయిలో నిలబెట్టాడు. ఆర్ఆర్ఆర్ చిత్రంతో.. రాజమౌళి పలు జాతీయ, అంతర్జాతీయ మీడియాలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇదే క్రమంలో ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఇందులో ఓ విలేకరి రామాయణం, మహాభారతం మీ చిత్రాలను ఎలా ప్రభావితం చేశాయని ప్రశ్నించారు. దీనికి రాజమౌళి బదులిస్తూ.. నా చిన్నతనంలో గ్రంధాల్లోని కథలు వింటూపెరిగాను.. అవి నన్ను ఎంతగానో ఆకర్షించాయి. కానీ ఆలోచించే వయసు వచ్చాక.. అందులోని పాత్రలు, వాటిలోని సంఘర్షణలు, భావోద్వేగాలను మాత్రమే చూడగలిగాను. అలాంటి భావోద్వేగాలే నా చిత్రాల్లో ఉంటాయని రాజమౌళి సమాధాన ఇచ్చారు.
ఆ తర్వాత మీరు నాస్తికుడు కదా అని ప్రశ్నించగా.. కుటుంబం వల్ల హిందూ మతాన్ని ఫాలో అయ్యేవాడిని. కొన్నాళ్ళ తర్వాత సన్యాసిగా.. ఆ తర్వాత క్రైస్తవ మతంలోకి కూడా అడుగుపెట్టినట్లు పేర్కొన్నాడు. ఇవన్నీ చేశాక నాకు ఓ విషయం అర్ధమైంది. మతం అనేది ఒక రకమైన దోపిడీ అని అనిపించింది. అందుకే నాస్తికుడిగా మారాను. కానీ ఆ గ్రంధాల్లోని గొప్ప కథలు, పాత్రలు నా మనసులో గట్టిగా పాతుకుపోయాయి అంటూ వివరించాడు. అయితే రాజమౌళి మతం అనేది ఒక రకమైన దోపిడీ అని చేసిన వ్యాఖ్యలను కొంతమంది ఖండిస్తున్నారు. ఆ మాటలు వెనక్కి తీసుకోవాలని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కూడా రాజమౌళిపై దాడి చేస్తున్నారు.
రాజమౌళిపై ట్రోలింగ్.. కంగనా ఫైర్ (Kangana Ranaut)
మతంపై రాజమౌళి వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో కొందరు తప్పుబడుతున్నారు. దీనిపై పైర్ బ్రాండ్ కంగనా స్పందించింది. ఇంటర్వ్యూలో చెప్పిన ఎన్నో విషయాలను వదిలేసి.. ఈ ఒక్క విషయాన్నే హైలైట్ చేయటం ఏంటని ఆమె ప్రశ్నించారు. ఈ మేరకు.. రాజమౌళికి సపోర్ట్ చేస్తూ కంగనా వరుస ట్వీట్లు చేశారు. ఈ విషయానికి అంత అతిగా స్పందించాల్సిన అవసరం లేదు. దేవుడు ప్రతి చోటా ఉంటాడు. మాటల కన్నా చేతలే కనిపించాలి. రాజమౌళి సర్‌ని ఎవరైనా ఏమైనా ఉంటే ఊరుకోను. అంటూ ట్వీట్ చేసింది. అలాగే.. రాజమౌళి వర్షంలో మండే నిప్పు.. ఓ జాతీయవాది. యోగిగా వర్ణించింది. ఈ ప్రపంచం రాజమౌళిని వివాదాస్పద వ్యక్తిగా ముద్రవేస్తోంది. ఆయన సృష్టించిన వివాదం ఏంటి?. రాజమౌళి లాంటి వ్యక్తిత్వాన్ని ప్రశ్నించడానికి మీకెంత ధైర్యం.. అందరూ సిగ్గు పడాలి అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.1200 కోట్లకు పైగా వసూళ్లును సాధించింది. ఈ సినిమాలో ‘నాటు నాటు’ పాట ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నామినేషన్ దక్కించుకుంది. అలాగే.. గోల్డెన్ గ్లోబ్ అవార్డును సైతం సొంతం చేసుకుంది.