Last Updated:

K Sanjay Murthy: కాగ్ కొత్త బాస్‌గా తెలుగు వ్యక్తి.. రేపే బాధ్యతలు స్వీకరణ

K Sanjay Murthy: కాగ్ కొత్త బాస్‌గా తెలుగు వ్యక్తి.. రేపే బాధ్యతలు స్వీకరణ

K Sanjay Murthy appointed next Comptroller and Auditor General: కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ పదవిలో తెలుగు అధికారి నియామకమయ్యారు. కాగ్‌ కు కొత్త చీఫ్ గా అమలాపురానికి చెందిన ఐఏఎస్ అధికారి కె.సంజయ్ మూర్తిని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1989 బ్యాచ్ కు చెందిన సంజయ్ ని కాగ్ చీఫ్ గా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నియమించగా, కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. సంజయ్ మూర్తి హిమాచల్ ప్రదేశ్ కేడర్ నుంచి ఐఏఎస్ గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం కేంద్ర విద్యాశాఖలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం కాగ్ చీఫ్‌గా ఉన్న గిరీష్ చంద్ర ముర్ము పదవీకాలం ఈ నెల 20‌తో ముగియనున్నది. దీంతో కేంద్రం సంజయ్ ను నియమించింది.

అమలాపురం మాజీ ఎంపీ కేఎస్‌ఆర్‌ మూర్తి కొడుకు సంజయ్..
అమలాపురం మాజీ ఎంపీ కేఎస్‌ఆర్‌ మూర్తి కుమారుడే సంజయ్ మూర్తి. ఈయన 1964 డిసెంబరు 24న జన్మించారు. మెకానికల్‌ విభాగంలో ఇంజినీరింగ్‌ విద్యనభ్యసించారు. 1989 సివిల్స్‌లో హిమాచల్ ప్రదేశ్ కేడర్‌కు ఎంపికయ్యారు. 2002-07 మధ్యకాలంలో కేంద్ర అటవీ, పర్యావరణ, ఐటీ మంత్రిత్వ శాఖల్లో పని చేశారు. ఆ సమయంలో హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ స్మార్ట్‌ గవర్నమెంట్‌‌లో మూడేండ్లు కొనసాగాడు. ప్రస్తుతం కేంద్ర విద్యా శాఖ‌లో హయ్యర్ ఎడ్యుకేషన్ విభాగం సెక్రెటరీగా ఉన్నారు.

ఈ నెల 21న బాధ్యతలు..
ప్రస్తుతం కేంద్ర విద్యా శాఖలో హయ్యర్ ఎడ్యుకేషన్ విభాగం సెక్రటరీగా ఉన్నారు. అక్టోబరు 1, 2021 నుంచి ఆ పదవిలో కొనసాగుతున్నారు. ఉన్నత విద్యకు సంబంధించిన విధానాలను పర్యవేక్షించడం, ప్రభుత్వ కార్యక్రమాల అమలును నిర్ధారించడం, దేశవ్యాప్తంగా విద్యా అభివృద్ధిని ప్రోత్సహించేలా విద్యా సంస్థలకు సహకరించడం వంటి కీలక బాధ్యతలు తీసుకున్నారు. ఈ నెల 21న సంజయ్ బాధ్యతలు చేపట్టనున్నారు.