Home / తెలంగాణ
అవినీతి గురించి మాట్లాడితే భయమెందుకని, తన పాదయాత్రను ఆపేందుకు ఎమ్మెల్యేలు కుట్ర చేస్తున్నారని, తెలంగాణాలో తాలిబన్ల రాజ్యమేలుతుందిని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు
గణేష్ నిమజ్జనం వేడుకలను అత్యంత వైభవంగా చేపట్టే ప్రాంతాల్లో ఢీల్లీ తర్వాత హైదరాబాదుకు ప్రత్యేక స్థానం ఉంది. లక్షలాది వినాయక విగ్రహ ప్రతిమలను ఊరేగింపు అనంతరం ఆయా ప్రాంతాల్లో కేటాయించిన ప్రదేశాల్లో గణనాధుడిని నిమజ్జనం చేస్తుంటారు. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో వ్యయప్రయాశలతో నిమజ్జన వేడుకలను విజయవంతం చేసేందుకు కీలక వ్యవస్ధలను ఉపయోగించుకొనింది.
ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 18,19,20న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం సూచించింది.
ఎంఐఎం స్వాతంత్ర్య సమరయోధులు తుర్రేబాజ్ ఖాన్, మౌల్వీ అల్లావుద్దీన్‌ల వారసులని, ఖాసిం రిజ్వీ కాదని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.టీఎస్ జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకల్లో భాగంగా పార్టీ బైక్ ర్యాలీ అనంతరం బహిరంగ సభలో ఒవైసీ ప్రసంగించారు.
గులాబీ బాస్ కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనకు ముహూర్తం దాదాపు ఖరారైనట్టే తెలుస్తోంది. దేశంలోని పలు ప్రాంతీయ పార్టీల నేతలు, మేధావులతో విస్తృత సమాలోచనలు జరుపుతోన్న కేసీఆర్. పార్టీని దసరా నాటికి ప్రకటించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో ఉగ్రవాద కార్యకలాపాలపై ఎన్ఐఏ సోదాలు చేపట్టింది. పీఎఫ్ఐ (పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా) కేసులో ఎన్ఐఏ తమ దర్యాప్తును వేగవంతం చేసింది. నిజామాబాద్, నిర్మల్, కడప, కర్నూలు, గుంటూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో దాడులు చేపట్టింది.
తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ టూర్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేసీఆర్ ఏపీకి ఎందుకొస్తున్నారని, అంతా ఆరా తీస్తున్నారు. మూడేళ్ల క్రితం కేసీఆర్ ఏపీ పర్యటనకు వచ్చారు. అప్పుడు సీఎం వైఎస్ జగన్‌ను కలిసి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు.
భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్‌లో సరికొత్త ఉత్సాహం నింపుతున్నారు రాహుల్‌గాంధీ. కాస్త లేట్‌గా అయినా, లేటెస్ట్గా చేపట్టిన యాత్రకు ఆదరణ లభిస్తోంది. ఈ యాత్రలో తెలంగాణ నాయకులు కూడా పాల్గొంటున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నాయకుడు గాలి అనిల్‌కుమార్, భారత్ జోడో యాత్రలో రాహుల్ వెంట కలిసి నడిశారు.
పటాన్చెరు నియోజకవర్గంలో పొలిటికల్ వార్ హీటెక్కుతోంది. గూడెం బ్రదర్స్ జోరు వార్ వన్ సైడ్ అన్నట్టుగా ఉంది. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఆయన తమ్ముడు గూడెం మధుసూదన్ రెడ్డి వ్యూహత్మకంగా నియోజకవర్గంలో పావులు కదుపుతున్నారు. రాజకీయంగా ప్రత్యర్థి వర్గం ఎత్తులను ఎప్పటికప్పుడు చిత్తు చేస్తూ దూసుకెళ్తున్నారు.
మునుగోడు ఉప ఎన్నిక ఇప్పుడు తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీలకు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఈ ఉపఎన్నిక పోరుకు ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు విడుదల చేస్తారో తెలీకున్నా.. నియోజకవర్గంలో పరిస్థితులు రాజకీయ పార్టీలకు టెన్షన్ పుట్టిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఈ ఉప పోరులో అధికార పార్టీ అభ్యర్థిగా పలువురి పేర్లు వినిపిస్తున్న వేళ.. తాజాగా మాజీ ఎంపీ.. కేసీఆర్ కు సన్నిహితుడైన బూర నర్సయ్య గౌడ్ రేసులోకి వచ్చేసిన వైనం కలకలంగా మారింది.