Telangana: తెలంగాణ సంబురం.. వైభవంగా రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు
Telangana: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు 21 రోజులపాటు వివిధ కార్యక్రమాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Telangana: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు 21 రోజులపాటు వివిధ కార్యక్రమాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో రోజువారి కార్యక్రమాల షెడ్యూల్ ను కేసీఆర్ విడుదల చేశారు. మెుదట జూన్ 2న గన్ పార్క్ వద్ద గల అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పిస్తారు. ఆ తర్వాత.. సచివాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు.
21 రోజులు పండగ.. (Telangana)
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు 21 రోజులపాటు వివిధ కార్యక్రమాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో రోజువారి కార్యక్రమాల షెడ్యూల్ ను కేసీఆర్ విడుదల చేశారు. మెుదట జూన్ 2న గన్ పార్క్ వద్ద గల అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పిస్తారు. ఆ తర్వాత.. సచివాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు.
కార్యక్రమాలు ఇవే..
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. అందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది. 21 రోజుల పాటు ప్రతిరోజూ ఓ రంగానికి ప్రాధాన్యం కల్పించారు. అవేంటో ఓసారి చూద్దాం.
జూన్ 2న ఉత్సవాలు ప్రారంభం: గన్ పార్క్ వద్ద అమరవీరులకు కేసీఆర్ నివాళులు అర్పిస్తారు. అప్పటినుంచే వేడుక ప్రారంభం అవుతుంది. జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం.. ఉత్సవ సందేశమిస్తారు. మరోవైపు అన్ని జిల్లాల్లో మంత్రుల ఆధ్వర్యంలో జాతీయ పతాక వందనం, దశాబ్ది ఉత్సవ సందేశాలు తదితర కార్యక్రమాలు ఉంటాయి.
జూన్ 3న రైతు దినోత్సవం: రాష్ట్రంలోని అన్ని రైతు వేదికలు.. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. వ్యవసాయ రంగంలో సాధించిన విజయాలను, ఉచిత కరెంటు, రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాల విశిష్టతను తెలిపేలా కార్యక్రమాలు ఉంటాయి.
జూన్ 4న సురక్షా దినోత్సవం: పోలీసుశాఖ ఆధ్వర్యంలో సురక్షా దినోత్సవం’నిర్వహిస్తారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషిని, ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని ప్రజలకు వివరిస్తారు.
జూన్ 5న తెలంగాణ విద్యుత్తు విజయోత్సవం: ఈ రోజు విద్యుత్ రంగంలో ప్రభుత్వం సాధించిన గుణాత్మక మార్పును సభల్లో వివరిస్తారు. అదేరోజు సింగరేణిలో సంబురాలు కూడా జరుపుతారు.
జూన్ 6న పారిశ్రామిక ప్రగతి ఉత్సవం: పారిశ్రామిక వాడలు, ఐటీ కారిడార్లలో సభలు నిర్వహిస్తారు. వేర్వేరు రంగాల్లో సాధించిన ప్రగతిని వివరిస్తారు.
జూన్ 7న సాగునీటి దినోత్సవం: ప్రభుత్వం ఏర్పడ్డాక సాగునీటి రంగంలో సాధించిన ప్రగతిని వివరిస్తారు. అలాగే ప్రతి నియోజకవర్గంలో సభలు ఉంటాయి. రవీంద్ర భారతిలో ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాగునీటి రంగంలో సాధించిన విజయాలపై సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి సీఎం కేసీఆర్ హాజరవుతారు.
జూన్ 8న ఊరూరా చెరువుల పండుగ: గ్రామాల్లో సాంసృతిక కార్యక్రమాలుంటాయి. మత్స్యకారుల వలల ఊరేగింపులు ఘనంగా నిర్వహిస్తారు. చెరువు కట్టలపై సభలు నిర్వహిస్తారు.
జూన్ 9న సంక్షేమ సంబురాలు: ప్రభుత్వం అందించిన ఆసరా పెన్షన్లు, కల్యాణలక్ష్మి లాంటి సంక్షేమ పథకాల లబ్ధిదారులతో నియోజకవర్గ స్థాయిలో సభలు జరుపుతారు.
జూన్ 10న సుపరిపాలన దినోత్సవం: అన్ని జిల్లా కేంద్రాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి, రాష్ట్రంలో పరిపాలన సంస్కరణలతో ప్రభుత్వ వ్యవస్థలను ప్రజలకు మరింత చేరువ చేయడం ద్వారా కలిగిన మేలును వివరిస్తారు.
జూన్ 11న సాహిత్య దినోత్సవం: జిల్లాస్థాయిలో కవి సమ్మేళనాలు, రవీంద్రభారతిలో రాష్ట్రస్థాయి కవి సమ్మేళనం ఉంటుం ది.
జూన్ 12న తెలంగాణ రన్: అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో యువకులు, విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, అధికారులతో ఉదయం 6 గంటలకు తెలంగాణ రన్ జరుగుతుంది.
జూన్ 13న మహిళా సంక్షేమ దినోత్సవం: మహిళా సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలను వివరిస్తారు.
జూన్ 14న వైద్యారోగ్య దినోత్సవం: రాష్ట్రంలో వైద్యారోగ్యరంగంలో సాధించిన విప్లవాత్మక అభివృద్ధి గురించి ప్రజలకు వివరిస్తారు.
జూన్ 15న పల్లె ప్రగతి దినోత్సవం: దేశానికే ఆదర్శంగా నిలిచి తెలంగాణ పల్లెలు సాధించిన ప్రగతిని తెలిపే పలు కార్యక్రమాలు ఉంటాయి.
జూన్ 16న పట్టణ ప్రగతి దినోత్సవం: పట్టణ ప్రగతి ద్వారా ప్రతి కార్పొరేషన్, మున్సిపాలిటీలు, పట్టణాలు సాధించిన ప్రగతిని వివరిస్తారు.
జూన్ 17న తెలంగాణ గిరిజనోత్సవం: కొత్తగా ఏర్పడిన గిరిజన గ్రామాల్లో సభలు నిర్వహిస్తారు. గిరిజన సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకొన్న చర్యల గురించి వివరిస్తారు.
జూన్ 18న మంచి నీళ్ల పండుగ: మిషన్ భగీరథ స్కీమ్‌తో ఇంటింటికి నల్లాలు ఏర్పాటు చేసి.. ఉచితంగా స్వచ్ఛమైన సురక్షిత నీటిని సరఫరా చేస్తున్న తీరును వివరించే కార్యక్రమాలు ఉంటాయి.
జూన్ 19న తెలంగాణ హరితోత్సవం: గ్రామాలు, పట్టణాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తారు.
జూన్ 20న తెలంగాణ విద్యాదినోత్సవం: రాష్ట్రవ్యాప్తంగా అన్నిరకాల విద్యా సంస్థల్లో సభలు నిర్వహిస్తారు. విద్యారంగంలో తెలంగాణ సాధించిన విజయాలను వివరిస్తారు. అదే రోజు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న మన ఊరు-మన బడి పాఠశాలల ప్రారంభిస్తారు.
జూన్ 21న ఆధ్యాత్మిక దినోత్సవం: దేవాలయాలు, మసీదులు, చర్చిలు, ఇతర మత ప్రార్థనా మందిరాల్లో కార్యక్రమాలు ఉంటాయి.
జూన్ 22న అమరుల సంస్మరణ: తెలంగాణ వ్యాప్తంగా పల్లెపల్లెనా, పట్టణాలు, నగరాల్లో, విద్యాలయాల్లో అమరులకు శ్రద్ధాంజలి ఘటిస్తారు.
21 రోజులు రాష్ట్రమంతా ఆత్మ గౌరవ నినాదం మార్మోగాలన్నది సీఎం కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తోంది. ఇందులో భాగంగానే ప్రభుత్వ పథకాలను సబ్బండ ప్రజల ముంగిట్లోకి తీసుకెళ్లాలని సంకల్పించారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ ఉత్సవాలు జరిపినట్టే.. తెలంగాణ ఆవిర్బావ దశాబ్ది ఉత్సవాలకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టినట్టు స్పష్టమవుతోంది.