DAV School: డీఏవీ స్కూల్ లైంగిక దాడి ఘటన.. నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష
DAV School: డీఏవీ స్కూల్ లో జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. నాలుగేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడు రజనీ కుమార్ కు న్యాయస్థానం 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
DAV School: డీఏవీ స్కూల్ లో జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. నాలుగేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడు రజనీ కుమార్ కు న్యాయస్థానం 20
ఏళ్ల జైలు శిక్ష విధించింది. వాదనలు విన్న నాంపల్లి కోర్టు.. నిందితుడికి శిక్ష ఖరారు చేసింది.
శిక్ష విధించిన నాంపల్లి కోర్టు.. (DAV School)
డీఏవీ స్కూల్ లో జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. నాలుగేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడు రజనీ కుమార్ కు న్యాయస్థానం 20
ఏళ్ల జైలు శిక్ష విధించింది. వాదనలు విన్న నాంపల్లి కోర్టు.. నిందితుడికి శిక్ష ఖరారు చేసింది.
బంజారాహిల్స్ డీఏవీ స్కూల్ డ్రైవర్ ఆకృత్యాలపై కోర్టు తీర్పు వెల్లడించింది. గతేడాది డీఏవీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ కారు డ్రైవర్.. విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసులో కారు డ్రైవర్‌ను న్యాయస్థానం దోషిగా తేల్చుతూ.. శిక్ష ఖరారు చేసింది.
వాదనల అనంతరం.. నాంపల్లి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు 20ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది.
ఇక ఇదే కేసులో స్కూల్ ప్రిన్సిపాల్ మాదవి రెడ్డిని నిర్ధోషిగా పేర్కొంటు కోర్టు తీర్పు ఇచ్చింది.
గతేడాది బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లోని డీఏవీ పాఠశాలలో నాలుగేళ్ల చిన్నారిపై లైంగికదాడి జరిగింది.
పలుమార్లు నిందితుడు లైంగిక దాడికి పాల్పడినట్లు రుజువైంది.
తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అక్టోబర్ 17న పోలీస్ స్టేషన్‌లో నిందితుడిపై కేసు నమోదైంది.
ఈ విషయమై విద్యార్ధుల తల్లిదండ్రులు, విద్యార్ధి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించాయి.
ఈ ఘటన సంచలనంగా మారడంతో.. పాఠశాల గుర్తింపును ప్రభుత్వం రద్దు చేసింది.
అయితే విద్యార్ధుల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని గుర్తింపును ప్రభుత్వం పునరుద్దరించింది.
ఆరు నెలల దర్యాప్తు, విచారణ తర్వాత కోర్టు దోషికి శిక్ష ఖరారు చేసింది.
నిందితుడికి శిక్ష విధించడంపై బాలిక తల్లిదండ్రులతో పాటు.. వివిఘ విద్యార్ధి సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.