Alliant Group: హైదరాబాద్ కు అలయంట్ గ్రూప్.. 9వేల మందికి ఉద్యోగాలు
Alliant Group: అమెరికా పర్యటనలో కేసీఆర్ బిజీబిజీగా గడుపుతున్నారు. పెట్టుబడులే లక్ష్యంగా.. వివిధ కంపెనీ ప్రతినిధులతో సమావేశం అవుతున్నారు.
Alliant Group: అమెరికా పర్యటనలో కేసీఆర్ బిజీబిజీగా గడుపుతున్నారు. పెట్టుబడులే లక్ష్యంగా.. వివిధ కంపెనీ ప్రతినిధులతో సమావేశం అవుతున్నారు. ఇందులో భాగంగా.. హ్యూస్టన్‌లో అలయంట్ కంపెనీ సీఈవో ధవల్ జాదవ్‌తో కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ కంపెనీ హైదరాబాద్ లో కొత్త కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోందని తెలిపారు.
What a lovely welcome at Alliant Headquarters today at Houston!!
Many thanks @Dhavaljadav02 for the grand reception and hospitality 🙏 pic.twitter.com/H8OAhJEfXo
— KTR (@KTRBRS) May 20, 2023
హైదరాబాద్ కు అలయంట్..
అమెరికా పర్యటనలో కేసీఆర్ బిజీబిజీగా గడుపుతున్నారు. పెట్టుబడులే లక్ష్యంగా.. వివిధ కంపెనీ ప్రతినిధులతో సమావేశం అవుతున్నారు. ఇందులో భాగంగా.. హ్యూస్టన్‌లో అలయంట్ కంపెనీ సీఈవో ధవల్ జాదవ్‌తో కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ కంపెనీ హైదరాబాద్ లో కొత్త కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోందని తెలిపారు.
కన్సల్టింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అనే సంస్థ.. హైదరాబాద్ లో ఓ కేంద్రాన్ని ప్రారంభించనుంది. దీంతో ఇక్కడ దాదాపు 9వేల మందికి ఉద్యోగవకాశాలు ఏర్పడతాయని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ మేరకు హ్యూస్టన్ లో కంపెనీ సీఈవో ధవల్ జాదవ్‌తో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగంలో అలయంట్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది.
ఈ సంస్థ తన కేంద్రాన్ని ప్రారంభించడంతో.. కొత్తగా 9వేల మందికి ఉపాధి అవకాశం లభించనుంది. ట్యాక్స్, అకౌంటింగ్, ఆడిట్ సర్వీస్, ఐటీ టెక్నాలజీ యువతకు ఇదో గొప్ప అవకాశంగా నిలుస్తుందని మంత్రి అన్నారు. అలయంట్ తీసుకున్న నిర్ణయం నగరంపై ఉన్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని తెలియజేస్తోందని మంత్రి తన ట్వీట్‌లో వెల్లడించారు. హ్యూస్టన్‌లోని అలయంట్ గ్రూప్ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన మంత్రి కేటీఆర్‌కు అక్కడ ఘనస్వాగతం లభించింది. మంత్రి కేటీఆర్‌కు ఆ సంస్థ ఉద్యోగులు స్వాగతం పలికారు. పూల మాలలు వేసి ఆహ్వానం పలికారు.