Rice Water: ఈ చిట్కాను పాటించండి.. మీ అందాన్ని పెంచుకోండి!
పాత కాలం నుంచి బియ్యపు నీరు వల్ల మన ముఖానికి అనేక ప్రయోజనాలున్నాయని చెబుతుంటారు. ఇప్పుడున్న సమాజంలో చాలా మంది అమ్మాయిలు అందం గురించి ఆందోళన పడుతుంటారు. చాలా కాలం నుంచి అమ్మాయిలు బియ్యం నీటిని వాడుతున్నారు.
Beauty Tip: పాత కాలం నుంచి బియ్యపు నీరు వల్ల మన ముఖానికి అనేక ప్రయోజనాలున్నాయని చెబుతుంటారు. ఇప్పుడున్న సమాజంలో చాలా మంది అమ్మాయిలు అందం గురించి ఆందోళన పడుతుంటారు. చాలా కాలం నుంచి అమ్మాయిలు బియ్యం నీటిని వాడుతున్నారు. ప్రస్తుతం ఇది అందం చిట్కాగా మారింది. చర్మం తెలుపుగా రావడానికి, మెరవడానికి, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఇలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉపయోగిస్తున్నారు. బియ్యం కడిగిన నీరును చాలా మంది బయట పడేస్తుంటారు. అలా బయట పడేయకండి. వీటి వల్ల కూడా కొన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవి ఏంటంటే వయసు వల్ల వచ్చే ముడతలు, మచ్చల్ని పోగొట్టడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.
బియ్యపు నీరు మన ముఖానికి పెట్టుకోవాలంటే ముందు వాటి తయారీ విధానం కూడా తెలిసి ఉండాలి కదా. ఎలా తయారు ఇక్కడ తెలుకుందాం.
నానబెట్టిన బియ్యపు నీరు చేయడం చాలా సులభం. ముందుగా దీని కోసం మీరు అర కప్పు పొడి బియ్యాన్ని తీసుకుని దానిలో ఉన్నామట్టిని, చెత్తను నీరుతో కడిగి శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత వాటిలో కొన్ని మంచి నీరును పోసి మళ్ళీ శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు కడిగిన బియ్యాన్ని తీసుకొని వాటిలో రెండు కప్పుల నీరును పోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 30 నిమిషాల పాటు అలాగే నాననివ్వాలి. ఆ తర్వాత బియ్యాన్ని వేరు చేసి నీరును వేరే గిన్నెలోకి తీసుకోవాలి అంతే స్వచ్చమైన బియ్యపు నీరు రెడీ. ఈ నీరు ఎన్ని రోజులు ఉంటాయా అని సందేహపడుతున్నారా వీటిని ఫ్రిడ్జ్‌లో నిల్వ చేస్తే ఏడు రోజుల వరకు మనం వాడవచ్చు.