Published On:

Rainy Day Soups: వర్షాకాలం సూప్.. తాగితే శరీరం ఫిట్టుగైతది.. టైచేయండి మరి..!

Rainy Day Soups: వర్షాకాలం సూప్.. తాగితే శరీరం ఫిట్టుగైతది.. టైచేయండి మరి..!

Rainy day soup for fitness and health: వర్షాకాలం వచ్చేసింది. దేశం మొత్తంలో వర్షాలు పడటం మొదలయ్యాయి. వెదర్ కూల్ గా అయింది. ఇప్పుడు శరీరానికి వెచ్చగా ఆహారాన్ని అందిస్తే చాలా సుఖంగా ఆరోగ్యంగా ఉంటుంది. అందులో భాగంగానే సూప్ ను వర్షాకాలంలో తీసుకోవాలంటున్నారు ఆహార నిపుణులు. ఇందులో పోషకాలు మెండుగా ఉంటాయన్నారు. మీరు సులభమైన సూప్ లను తయారు చేసుకోవచ్చు. ఇవి ఎక్కువ సమయాన్ని తీసుకోవు. పైగా తొందరగా తాగేయోచ్చు. అలాంటి సులభమైన సూప్ లను ఇక్కడ ఇస్తున్నాము.

వెజిటెబుల్ సూప్
ఈ సూప్ లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇందులో వాడిన కూరగాయలు సీజన్ లో దొరికేవే. ఇందులో క్యారెట్, బీన్స్, స్పినాచ్ వాడతారు. వీటన్నింటిని ఉడకబెట్టి ఇందులో అల్లం, నల్ల మిరిమాల పొడి కలపాలి. ఇది లో కాలరీస్ మరియు ఇమ్యునిటీని బూస్ట్ చేస్తాయి.

టమాటా తులసి కలిసిన సూప్
ఇందులో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇందులో ఫ్రెష్ టమాటాలు, గార్లిక్, ఆనియన్స్, తులసి ఆకులను కలుపుతారు. అన్ని సూప్ లు చేసినట్లుగానే వీటిని ఉడకబెడతారు. ఇందులో చిరు దాన్యాలను కూడా వేసుకోవచ్చు. చిరు ధాన్యాలు అంటే అరికెలు, సామలు, ఉదలు లాంటి వాటిని వాడవచ్చు. ఇవి శరీరానికి వేడిని ఇస్తాయి.

చికెన్ సూప్
ఇది పక్కా నాన్ వెజిటేరియన్స్ కోసమే. దీన్ని జుర్రుకుని తాగుతారు, అంటే అతిషయోక్తి కాదు. ఇందులో సన్నగా తరిగిన ( కోసిన) చికెన్ ముక్కలు, క్యారెట్, ఆలు, ఆకు కూరలు వేసి ఉడక బెట్టాలి. ఇందులో కూడా తగినంత మిరియాల పొడిని వాడుకోవచ్చు. ఇది రిచ్ ప్రోటీన్ ను శరీరానికి అందజేస్తుంది. మినరల్స్ ను సమకూరుస్తుంది.

లెంతిల్ సూప్ ( దాల్ సూప్)
దాల్ సూప్ ను పప్పు దాన్యాలతో తయారు చేస్తారు. ఇందులో ప్రోటీన్ ఫైబర్ లు సమృద్ధిగా ఉంటాయి. మూంగ్ దాల్ లేదా పెసర పప్పు, పసుపు, ఇలాయిచీ, దాల్చీనా, అల్లం, టీ స్పూన్ లెమన్ వేసి ఉడికించాలి. వేడివేడిగా సర్వే చేసి తాగితే అద్భుతం.

మిక్స్ డ్ బీన్ సూప్
ఇందులో కిడ్నీ బీన్స్, తెల్ల చెనిగెలు, నల్లచెనిగెలు, రుచికి మిరియాలు, ఉప్పు వేసి ఉడికించాలి. ఇందులో హై ప్రోటీన్ ఉంటుంది. టమాటాలు, అల్లం, ఆకు కూరలు కూడా వేసుకోవచ్చు. ఇది ఒక్క పూట ఆహారానికి సరిపోతుంది.

స్వీట్ కార్న్ సూప్
స్వీట్ కార్న్ సూప్ చాలా ఫేమస్. ఎక్కడైనా ఎవరైనా ఇట్టే ఇష్టపడతారు. వర్షాకాలంలో చాలామంది ఇష్టంగా తాగుతారు. కార్న్ లో ఫైబర్, తీయదనం ఉంటుంది. కార్న్ , అల్లం, మిరియాలు ఈ సూప్ లో వాడతారు. దీంతో పాలు ఇందులో టోఫు, చికెన్ ను కూడా వేసుకోవచ్చు.

గుమ్మడికాయ క్యారెట్ సూప్
ఇది క్రీమీగా థిక్ గా ఉంటుంది. గుమ్మడి కాయను క్యారెట్స్ ను బ్లెండ్ చేసుకుని అందులో కోకోనట్ మిల్క్ ను యాడ్ చేసుకోవాలి. ఇందులో విటమిన్ ఎ, సి అధికంగా ఉంటుంది.

గమనిక.. ఈ ఆర్టికల్ కేవలం అవగాహన కోసం మాత్రమే, కచ్చితత్వానికి చానల్ బాధ్యత వహించదు. పాటించేముందు డాక్టర్లు నిపుణుల సలహా తీసుకోగలరు.

ఇవి కూడా చదవండి: