Food for GUT Health: జీర్ణవ్యవస్థ శక్తి వంతంగా పనిచేయాలంటే వీటిని ఆహారంలో భాగం చేయండి!

Supercharge Your Gut: జీర్ణవ్యవస్థ అనేది మనిషి జీవన ప్రమానానికి చాలా ఉపయోగం. జీర్ణ వ్యవస్థలో అతి సూక్ష్మమైన బ్యాక్టీరియా ఉంటుంది దీనినే గట్ అని పిలుస్తారు. ఇది ఆరోగ్యాన్ని, ఆనందాన్ని సమకూరుస్తుంది. కొన్ని ఆహార పదార్థాలు గట్ ను బలంగా మారుస్తాయి. ఇవి జిర్ణవ్యవస్థ యొక్క అరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. అయితే గట్ ను బలపరచడానికి కొన్ని ఆహారాలను తీసుకోవాలి. ఈ కాంబినేషన్ గల ఆహారపదార్థాలు గట్ ను బలపరిచేలా చేస్తుంది.
కొన్ని రకాల ఆహార కాంబినేషన్లు గట్ ఆరోగ్యానికి కారణమవుతాయంటున్నారు నిపుణులు. హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్‌లో శిక్షణ పొందిన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ల సేథీ తెలిసిన సమాచారం ప్రకారం మనం నిత్యం వాడే ఆహారపదార్థాలలోని కొన్ని జీర్ణవ్యవస్థకు మంచివని చెబుతున్నారు.
డాక్టర్ సేథీ పోషకాహారానికి చెందిన టిప్స్ ను తరచూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. తాజాగా జీర్ణవ్యవస్థకు ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిదని చెబుతున్నారు.
బలమైన జీర్ణవ్యవస్థకు ( గట్) నాలుగు ముఖ్యమైన ఆహారపదార్థాలను తీసుకోవాలంటున్నారు.
సిట్రస్ పండ్లు + ఐరన్ రిచ్ ఫుడ్స్..
ఐరన్ కలిగిన ఆహారపదార్థాలను పండ్లను క్రమం తప్పకుండా తినాలని అంటున్నారు. సిట్రస్ పండ్లను ఆహారంలో భాగం చేసుకోవడం చాలా ముఖ్యమని తెలిపారు. సిట్రస్ లో ఉండే విటమిన్ సి శరీరానికి చాలా ముఖ్యమన్నారు.
పసుపు + నల్లమిరియాలు..
పసుపు భారతీయ ఆహార విధానంలో చాలా ముఖ్య పాత్రను పోషిస్తుంది. వెజ్ అయినా నాన్ వెజ్ అయినా పసుపు లేనిదే వండ వండటం జరగదు. అలాంటి పసుపు గట్ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగమని అంటున్నారు. పసుపుతో పాటు నల్ల మిరియాలు కలిపి తీసుకోవాలని చెబుతున్నారు. నల్లమిరియాలలోని ఆల్కలాయిడ్ పైపెరిన్, ఇది కర్కుమిన్ (పసుపులోని భాగం) ను 2000 శాతం వరకు పెంచుతుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (NIH) కర్కుమిన్ యొక్క ప్రయోజనాలను నొక్కి చెబుతుంది.
అవకాడో + ఆకుకూరలు..
ఆకుకూరలు ఆరోగ్యానకి చాలా ప్రయోజనకరం. జీర్ణక్రియ బలంగా తయారవాలంటే ఆకుకూరలతో ఆవకాడోను జతచేయాలని డాక్టర్ సేథి సూచిస్తు్న్నారు. అవకాడోలోని కొవ్వులు ఆకుకూరల నుండి విటమిన్ A, D, E మరియు K లను శరీరానికి అందిస్తుంది.
డార్క్ చాక్లెట్ + బాదం..
డార్క్ చాక్లెట్లు జీర్ణవ్యవస్థకు చాలా మంచివి. దీంతో పాటు బాదాం తీసుకోవడం వలన ఆరోగ్యకరమైన కొవ్వులు మరియు విటమమిన్ Eశరీరానికి అందుతాయి. చాక్లెట్‌లోని ఫ్లేవనాయిడ్స్ యాంటీఆక్సిడెంట్ కంటెంట్‌ను పెంచుతుందని సేథి తెలుపుతున్నారు. బాదంతో డార్క్ చాక్లెట్ ను ఆస్వాదించడం మాత్రం మదురానుభూతే!
గమనిక… పై విషయాలన్ని కేవలం అవగాహన కోసం మాత్రమే. పాటించే ముందు దగ్గరలోని డాక్టర్ ను సంప్రదించగలరు. కచ్చితత్వానికి చానల్ బాధ్యత వహించదు.