Last Updated:

Secunderabad To Goa Train: సికింద్రాబాద్ టూ గోవా కొత్త రైలు ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Secunderabad To Goa Train: సికింద్రాబాద్ టూ గోవా కొత్త రైలు ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Kishan Reddy inaugurated Secunderabad To Goa Train: సికింద్రాబాద్ – వాస్కోడిగామా రైలును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్‌లోని రైల్వే స్టేషన్ 10వ ఫ్లాట్ ఫారంపై జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు ప్రతి బుధవారం, శుక్రవారం సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుండగా.. ప్రతి గురువారం, శుక్రవారం వాస్కోడిగామా నుంచి బయలుదేరనుంది. సికింద్రాబాద్ నుంచి వాస్కోడిగామాకు చేరుకునేందుకు ఈ రైలు కేవలం 20 గంటల సమయం మాత్రమే తీసుకుంటుందని రైల్వే శాఖ అధికారులు తెలిపారు.

సికింద్రాబాద్ నుంచి ఉదయం 11.45 నిమిషాలకు బయలుదేరగా.. మరుసటి రోజు ఉదయం 7.20 నిమిషాలకు వాస్కోడిగామాకు చేరుకుంటుంది. ఈ రైలు కాచిగూడ, షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుంతకల్, బెళ్లారి, హోస్పేట, కొప్పల్, గడగ్, హుబ్బళ్లి, ధార్వాడ్, లోండా, క్యాసిల్ రాక్, కులెం, సాన్వోర్‌డెమ్, మడగావ్ జంక్షన్ల తదితర స్టేషన్‌లలో ఆగి బయలుదేరనుంది. ఇక, రెగ్యులర్ సర్వీసులు సికింద్రాబాద్ నుంచి అక్టోబర్ 9 నుంచి ప్రారంభమవుతుండగా.. వాస్కోడిగామా నుంచి అక్టోబర్ 10 నుంచి ప్రారంభమవుతున్నాయి.

ఇక ఈ రైలులో స్లీపర్‌ క్లాస్‌కు రూ.440, థర్డ్‌ ఎకానమీకి రూ.రూ.1,100, ఏసీ త్రీటైర్‌కి రూ.1,185, సెకండ్‌ ఏసీకి రూ.1,700, ఫస్ట్‌ ఏసీకి రూ.2,860గా టికెట్‌ ధరలను రైల్వే శాఖ నిర్ణయించింది. సికింద్రాబాద్ నుంచి వాస్కోడిగామా ఎక్స్ ప్రెస్ షాద్‌నగర్ మీద వెళ్తుంది. ఈ మేరకు బీజేపీ నాయకులు స్వాగతం పలికారు. ఇటీవల సికింద్రాబాద్ నుంచి గోవాకు రైళ్ల సంఖ్యలను పెంచాలని పర్యాటకులు ప్రతిపాదన మేరకు ఆమోదం తెలిపారు. ఇందులో భాగంగానే గోవాకు వారానికి రెండు రైళ్లు నడిపేందుకు రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఇవి కూడా చదవండి: