Last Updated:

CM KCR: ప్రభుత్వాలను కూలుస్తున్నారు, ఇది సరికాదు.. మోదీకి కేసిఆర్ విజ్ఞప్తి

తెరాస ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి తమ పార్టీ వైపు తిప్పుకొనేందుకు ప్రయత్నించారంటూ నమోదైన కేసులో నిందుతులు కీలక అంశాలు పేర్కొన్నట్లు సీఎం కేసిఆర్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఇప్పటికి ఎనిమిది ప్రభుత్వాలను కూల్చామని, ఇప్పుడు ఇంకో నాలుగు ప్రభుత్వాలను కూల్చే పనిలో నిమగ్నమై ఉన్నామని నిందితులు తెలిపారన్నారు

CM KCR: ప్రభుత్వాలను కూలుస్తున్నారు, ఇది సరికాదు.. మోదీకి కేసిఆర్ విజ్ఞప్తి

Hyderabad: తెరాస ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి తమ పార్టీ వైపు తిప్పుకొనేందుకు ప్రయత్నించారంటూ నమోదైన కేసులో నిందుతులు కీలక అంశాలు పేర్కొన్నట్లు సీఎం కేసిఆర్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఇప్పటికి ఎనిమిది ప్రభుత్వాలను కూల్చామని, ఇప్పుడు ఇంకో నాలుగు ప్రభుత్వాలను కూల్చే పనిలో నిమగ్నమై ఉన్నామని నిందితులు రామచంద్ర భారతి, సింహయాజి, నందు చెప్పినట్లు సీఎం ఆయన వెల్లడించారు.

తెలంగాణ, ఢిల్లీ, ఏపీ, రాజస్థాన్‌ల్లో ఆ జాబితాలో ఉన్నాయని అక్కడి ప్రభుత్వాలను కూలగొడతామని నిందితులు చెప్పారన్నారు. రాజస్థాన్‌లో 21 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే వచ్చేశారు. ఢిల్లీలో 44 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని చెప్పారు. ఆ 8 రాష్ట్రాల్లో మౌనంగా ఉన్నారు. కానీ, తెలంగాణలో పట్టుబడ్డారన్నారు. దాంతో, ఈ ముఠా వ్యవహారం బయటకు వచ్చింది. వీళ్లే కాదు. దేశవ్యాప్తంగా తమ ముఠాలో 24 మంది ఉన్నారని వాళ్లే చెప్పారు.

ఈడీ దగ్గర నుండిా ఐటీ  వరకు తామే చూసుకుంటామంటూ ఈ ముఠాలు స్వైర విహారం చేస్తున్నాయని కేసిఆర్ మండిపడ్డారు. సమాచారం వచ్చిన వెంటనే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను అప్రమత్తం చేశానన్నారు. మీ ఎమ్మెల్యేలను కొన్నారట. జాగ్రత్త పడాలని చెప్పాను. వాళ్లు స్పందించారని సీఎం కేసిఆర్ చెప్పడం కొసమెరుపు. ఎందుకంటే ఢిల్లీలో ఎమ్మెల్యేల కొనుగోలు వార్తలు ముందుగానే వచ్చాయి. కాని నేటి మీడియా సమావేశంలో కేసిఆర్ ఆ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ఇది కూడా చదవండి: CM KCR: ఎమ్మెల్యేలను కొంటుంటే..చేతులు ముడుచుకుని కూర్చోవాల్నా!? కేంద్రంపై ధ్వజమెత్తిన కేసిఆర్

ఇవి కూడా చదవండి: