Last Updated:

Maa Robot: దివ్యాంగురాలైన కుమార్తె కోసం రోబో తయారు చేసిన కూలీ

ఒకవైపు భార్య మంచం పట్టింది.. మరోవైపు ఎలాంటి చలనం లేని దివ్యాంగురాలైన 14 ఏళ్ల కుమార్తె. ఆమెకు అన్నం తినిపించడంతోపాటు అన్ని పనులు కన్న తండ్రే చేయవలసి వచ్చేది.

Maa Robot: దివ్యాంగురాలైన కుమార్తె కోసం రోబో తయారు చేసిన కూలీ

Goa: ఒకవైపు భార్య మంచం పట్టింది. మరోవైపు ఎలాంటి చలనం లేని దివ్యాంగురాలైన 14 ఏళ్ల కుమార్తె. ఆమెకు అన్నం తినిపించడంతో పాటు అన్ని పనులు కన్న తండ్రే చేయవలసి వచ్చేది. 12 గంటలపాటు అదేపనిగా కూలి పనిచేస్తే కానీ పూట గడవని పరిస్థితి. ఇది గోవాలోని పోండా తాలూకా బెదోరా గ్రామానికి చెందిన రోజువారీ కూలీ బిపిన్ కదమ్ దీనగాధ. రెండేళ్ల కిందట కదమ్ భార్య అనారోగ్యంతో మంచానికే పరిమితం కావడంతో దివ్యాంగురాలైన తన కుమార్తెకు కనీసం అన్నమైనా తినిపించలేక పోతున్నానని బాధపడుతుండేది.

కదమ్ తన కూలిపని పూర్తి చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత కుమార్తెకు అన్నం తినిపించేవాడు. అంతవరకు ఆమెకు అన్నం తినిపించడం ఉండేది కాదు. ఈ పరిస్థితుల్లో భార్య బాధను భరించలేక పోయాడు. ఏదో ఒకటి చేయాలనే దిశగా ప్రయత్నాలు ప్రారంభించాడు. తన కుమార్తె ఎవరిపైనా ఆధారపడకుండా ఆమెకు ఆహారం తినిపించే రోబో కోసం అన్వేషించాడు. అయితే ఎక్కడా అలాంటి రోబో లేదని తెలుసుకున్నాడు. తానే సొంతంగా రోబో తయారు చేయాలని సంకల్పించాడు. రోజూ 12 గంటల పాటు పనులు చేసుకుని మిగతా సమయాన్ని రోబో తయారీ కోసం వినియోగించాడు. నాలుగు నెలల పాటు ఆన్‌లైన్ ద్వారా రోబో తయారీ, సాంకేతిక ప్రక్రియ గురించి తెలుసుకుని చివరకు వాయిస్ కమాండ్ ద్వారా ఆహారం తినిపించే రోబోను తయారు చేశాడు.

ఇ వాయిస్ కమాండ్ ద్వారా ఏ ఆహారం కావాలో చెబితే ఆ ప్రకారం అన్నం, కూర కలపడం, తినిపించడం అన్నీ ఈ రోబో చేస్తుంది. ఈ రోబో గురించి గోవా స్టేట్ ఇన్నొవేషన్ కౌన్సిల్ తెలుసుకుని బిపిన్ కదమ్‌ను అభినందించింది. ఇలాంటి రోబోలు తయారు చేసేందుకు కదమ్‌కు ఆర్థిక సాయం అందించడానికి ముందుకు వచ్చింది.

ఇవి కూడా చదవండి: