Site icon Prime9

Super Star Krishna: కృష్ణ మృతికి కారణం అదే..!

super-star-maheshbabu-reach-vijayawada-to-immerse-late-father-krishna's-moral-remains-into-krishna river

super-star-maheshbabu-reach-vijayawada-to-immerse-late-father-krishna's-moral-remains-into-krishna river

Super Star Krishna: సీనియర్ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. గుండెపోటుతో నిన్న గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కాగా ఆయన మరణానికి గల కారణాలను వైద్యులు తాజాగా వెల్లడించారు. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వల్లే కృష్ణ మరణించారని కాంటినెటల్ వైద్యులు డాక్టర్ ఎన్ రెడ్డి మీడియాకు వివరించారు. గుండెపోటుతో ఆయన ఆసుపత్రిలో చేరిన వెంటనే ఎమర్జెన్సీకి తరలించి సీపీఆర్ చేసి ఆ తర్వాత చికిత్స ప్రారంభించామన్నారు. ఆసుపత్రికి వచ్చే సరికే కృష్ణ ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు డాక్టర్ గురు ఎన్ రెడ్డి తెలిపారు.

రెండు మూడు గంటల తర్వాత చాలా వరకు ఆయన శరీరంలోని అవయవాలు పనిచేయడం మానేశాయన్నారు. నాలుగు గంటల తర్వాత డయాలసిస్ అవసరం కావడంతో అది కూడా చేసినట్టు చెప్పారు.
అయితే నిన్న సాయంత్రానికే ఆయన ఆరోగ్యం మరింత దిగజారిందని, ఇక ఇలాంటి సమయంలో చికిత్స అందించినా ఫలితం ఉండదని వైద్యుల బృందం నిర్ధారణకు వచ్చినట్టు తెలిపారు. దానితో కృష్ణకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉన్న కొన్ని గంటలైనా మనఃశాంతితో వెళ్లిపోవాలని.. కుటుంబ సభ్యులతో చర్చించి తర్వాత చికిత్స ఆపేయాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఈ తెల్లవారుజామున 4.09 గంటలకు సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూశారని డాక్టర్ గురు ఎన్ రెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి: ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ “సూపర్ స్టార్ కృష్ణ”

 

Exit mobile version