Vizag Steel Plant: విశాఖ ఉక్కుపై తెలంగాణ కన్ను.. బిడ్డింగ్‌లో పాల్గొనాలన్న సీఎం కేసీఆర్
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఘన చరిత్ర కలిగి ఉంది. అలాంటి విశాఖ ఉక్కును కేంద్రం ప్రైవేటుపరం చెయ్యడాన్ని నిరసిస్తూ యాత్ ఆంధ్రులంతా ఒక్కతాటిపైకి వచ్చి పోరాటం సాగిస్తోన్నారు. కాగా తాజాగా విశాఖ ఉక్కు కర్మాగారంపై తెలంగాణ సర్కార్ ఆసక్తి చూపుతోంది.
Vizag Steel Plant: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఘన చరిత్ర కలిగి ఉంది. అలాంటి విశాఖ ఉక్కును కేంద్రం ప్రైవేటుపరం చెయ్యడాన్ని నిరసిస్తూ యాత్ ఆంధ్రులంతా ఒక్కతాటిపైకి వచ్చి పోరాటం సాగిస్తోన్నారు. కాగా తాజాగా విశాఖ ఉక్కు కర్మాగారంపై తెలంగాణ సర్కార్ ఆసక్తి చూపుతోంది. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటైజేషన్ కాకుండా అడ్డుకోవాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే విశాఖ ఉక్కు నిర్వహణకు మూలధనం, ముడిసరకుల కోసం నిధులు ఇచ్చి నిబంధనల మేరకు ఉక్కు ఉత్పత్తులను కొనేందుకు యాజమాన్యం నిర్వహిస్తున్న పాల్గొనే బిడ్డింగ్లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొనాలని నిర్ణయించింది. ఆసక్తి వ్యక్తీకరణ (ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ –ఈవోఐలో పార్టిసిపేట్ చెయ్యాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. బిడ్డింగ్ కు ఈ నెల 15వ తేదీ వరకు గడువు ఉంది. సింగరేణి సంస్థ ద్వారా బిడ్డింగ్లో పాల్గొనాలని, దీనికోసం విశాఖ ఉక్కు బిడ్డింగ్‌పై అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశించారు.
ఇక దీనికోసం జయేష్ రంజన్ బృందం రేపు విశాఖ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మొదటి నుంచి సీఎం కేసీఆర్ మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఇదిలాఉంటే, విశాఖ ఉక్కు ప్రైవేటైజేషన్ కు వ్యతిరేకంగా ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీకి మంత్రి కేటీఆర్ లేఖలు రాశారు.
ఈ బిడ్డింగ్లో సింగరేణి లేదా రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ లేదా నీటి పారుదల శాఖ పాల్గొనే అవకాశం ఉంది. విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేసేందుకు కేంద్రం సిద్ధమైందన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈనెల 15వ తేదీ సాయంత్రం 3గంటల వరకు ఈవోఐలో పాల్గొనాలని కోరింది. దానితో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణనను వ్యతిరేకించడంతో పాటు తమ అభిప్రాయాన్ని తెలియిజేయం..కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం కేసీఆర్ ప్రధాన ఉద్దేశాలుగా తెలుస్తుంది. అంతేకాకుండా తెలంగాణలో చేపట్టిన ప్రాజెక్టులకు ఉక్కును సమకూర్చుకోవడం వంటి లక్ష్యాలతో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ నెలాఖరున విశాఖలో బహిరంగ సభ(Vizag Steel Plant: )..
ఇదంతా ఒకెత్తు అయితే విశాఖ ఉక్కు ఎజెండాగా ఏపీలో బీఆర్ఎస్ పార్టీ విస్తరణకు కేసీఆర్ పావులు కదుపుతున్నట్టు సమాచారం. ఈ మేరకు విశాఖ పట్టణంలో ఈ నెలాఖరున బహిరంగ సభ ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీలో బీఆర్ఎస్ పార్టీని విస్తరించాలని చూస్తున్న కేసీఆర్ ఇదే అవకాశంగా భావిస్తున్నారట.