Actor Raj Kumar : మెగాస్టార్ చిరంజీవిలా ఉండటం అదృష్టం.. కానీ అదే నాకు శాపం – నటుడు రాజ్ కుమార్
సినిమాలు, సీరియల్స్ లలో నటించి తెలుగు ప్రజలకు బాగా సుపరిచితులు అయ్యారు నటుడు రాజ్ కుమార్. పేరు వింటే గుర్తుపట్టకపోవచ్చేమో కానీ.. మనిషిని చూస్తే మాత్రం ఇట్టే గుర్తు పట్టేస్తారు. ఎందుకంటే ఆ ఫేస్ కి మనం ఇచ్చే వాల్యూ అట్లుంటది మరి. సాధారణంగా మనిషిని పోలిన మనుషులను చూస్తూనే ఉంటాం. అలానే రాజా కుమార్ కూడా
Actor Raj Kumar : సినిమాలు, సీరియల్స్ లలో నటించి తెలుగు ప్రజలకు బాగా సుపరిచితులు అయ్యారు నటుడు రాజ్ కుమార్. పేరు వింటే గుర్తుపట్టకపోవచ్చేమో కానీ.. మనిషిని చూస్తే మాత్రం ఇట్టే గుర్తు పట్టేస్తారు. ఎందుకంటే ఆ ఫేస్ కి మనం ఇచ్చే వాల్యూ అట్లుంటది మరి. సాధారణంగా మనిషిని పోలిన మనుషులను చూస్తూనే ఉంటాం. అలానే రాజా కుమార్ కూడా మెగాస్టార్ చిరంజీవి లనే ఉంటారు. అందుకే ఆయనను ఎక్కువగా జూనియర్ మెగాస్టార్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ప్రస్తుతం తెలుగులో పలు సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉన్న రాజ్ కుమార్ ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మెగాస్టార్ చిరంజీవి వల్లే సినిమాల్లో తనకి ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదని వాపోయారు.
ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో కలుపుకుని 74 సినిమాలు చేశాను. వాటిలో 27 సినిమాలలో హీరోగా చేశాను అని అన్నారు. అలానే బుల్లితెరపై ‘విధి’, ‘పవిత్ర బంధం’ సీరియల్స్ ఆయనకి మంచి గుర్తింపును తెచ్చాయన్నారు. నేను కాలేజ్ రోజుల్లోనే చాలా స్టైల్ ను మెయింటేన్ చేసేవాడిని. మా ఫ్రెండ్స్ అంతా కూడా సినిమాల్లో ట్రై చేయమని ప్రోత్సహించేవారు. నన్ను సినిమాల్లోకి పంపించమని మా నాన్నతో ఆయన ఫ్రెండ్స్ అనడం మొదలుపెట్టారు. దాంతో మా నాన్న నన్ను చెన్నై పంపించడానికి ఒప్పుకున్నారు. అప్పుడు ఉద్యోగ రీత్యా మా నాన్నగారు ‘నెల్లూరు’లో ఉన్నారు. ఆ పక్క వీధిలోనే చిరంజీవి గారి ఇల్లు ఉండేది అని చెప్పుకొచ్చారు.
అలానే సినిమాల కోసం చెన్నై లో ఒక ఇల్లు .. ఒక కారు నాకు ఏర్పాటు చేయాలని మా నాన్నగారు నిర్ణయించుకున్నారు. ఇల్లు ఏర్పాటు చేశారు. చిరంజీవి గారు తన పాతకారును అమ్ముతున్నారని తెలిసి, నాన్నగారు ఆ కారును కొని నాకు ఇచ్చారు. చెన్నైలో ఉంటూ సినిమాల్లో ట్రై చేస్తున్న నన్ను ముందుగా ఆదరించింది దాసరి గారు అని తెలిపారు. ఫస్టు సినిమా చేసింది మాత్రం అల్లు అరవింద్ గారి బ్యానర్లో అని చెప్పారు. చిరంజీవిలా ఉండటం నా అదృష్టం. కానీ అలా ఉండటం వల్ల ఇండస్ట్రీలో పైకి వెళ్లలేక జూనియర్ చిరంజీవి గానే మిగిలిపోయానని వాపోయారు.
అయితే దాదాపు 74 సినిమాల్లో చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో గుర్తింపు వచ్చిందా అంటే .. రాలేదనే చెప్పాలి. అందుకు కారణం నేను చిరంజీవిలా ఉండటమే. చిరంజీవి లా భలే ఉంటాడురా అని ఎవరైనా అంటే చాలా ఆనందంగా ఉంటుంది. కానీ ఇండస్ట్రీకి వెళ్లిన తరువాత పరిస్థితి వేరుగా ఉంటుంది. చిరంజీవి లాగా ఉంటాము తప్పా, ఆయన అదృష్టానికీ .. స్థాయికి మనము ఎక్కడా సరిపోము అని చెప్పారు. అదే విధంగా అప్పట్లో నాతో పాటు శ్రీకాంత్, తమిళంలో విక్రమ్, ఆనంద్, అజిత్ ఇలా ఒక ఏడెనిమిది మంది హీరోలుగా ఎంట్రీ ఇచ్చాము. అందరికంటే ముందుగా నా కెరియర్ మొదలైంది. ఆ తరువాత వాళ్లంతా నన్ను దాటేసి ముందుకు వెళ్లిపోయారు. అందుకు కారణం ఏమిటంటే నేను చిరంజీవిలా ఉండటం. నా స్థాయికి తగినట్టుగా నేను చేసినా, చిరంజీవి గారితో పోల్చడం అంటూ నోరు విప్పారు.