Last Updated:

Salman Rushdie attacker Hadi Matar: రష్దీ ఇంకా బతికే ఉన్నాడా.. రష్దీపై హత్యాయత్నానికి పాల్పడిన హదీ మాతార్‌

సల్మాన్‌ రష్దీని హత్య చేయడానికి ప్రయత్నించిన 24 ఏళ్ల హదీ మాతార్‌ రష్దీ ఇంకా బతికే ఉన్నడనే సరికి ఆశ్చర్యపోయాడు. న్యూయార్కులో ఓ సాహితీ కార్యక్రమంలో ప్రసంగించడానికి ఉద్యుక్తుడవుతుండగా మాతార్‌ పరుగు పరుగున వచ్చి సల్మాన్‌ రష్దీ మెడపై, పొట్టలో కత్తితో దారుణంగా పొడిచాడు.

Salman Rushdie attacker Hadi Matar: రష్దీ ఇంకా బతికే ఉన్నాడా.. రష్దీపై హత్యాయత్నానికి పాల్పడిన హదీ మాతార్‌

New York: సల్మాన్‌ రష్దీని హత్య చేయడానికి ప్రయత్నించిన 24 ఏళ్ల హదీ మాతార్‌ రష్దీ ఇంకా బతికే ఉన్నడనే సరికి ఆశ్చర్యపోయాడు. న్యూయార్కులో ఓ సాహితీ కార్యక్రమంలో ప్రసంగించడానికి ఉద్యుక్తుడవుతుండగా మాతార్‌ పరుగు పరుగున వచ్చి సల్మాన్‌ రష్దీ మెడపై, పొట్టలో కత్తితో దారుణంగా పొడిచాడు. ఈ దాడిలో రష్దీ ఖచ్చితంగా చనిపోతాడని మాతార్‌ భావించాడు. తీరా బతికిపోయాడని తెలిసే సరికి డీలాపడిపోయాడని న్యూయార్కు పోస్టు ఒక కథనం ప్రచురించింది.

ఇక సల్మాన్‌రష్దీ విషయానికి వస్తే సటానిక్‌ వర్సెస్‌ పుస్తకం రాసి ముస్లిం దేశాల ఆగ్రహానికి గురయ్యాడు. ఇరాన్‌ మత గురువు ఆయుతుల్లా ఖొమెనీ రష్దీ తలనరికిన వారికి 3.5 మిలియన్‌ డాలర్ల బహుమానం ప్రకటించారు. ఆయతుల్లా ఖొమెనీని తాను గౌరవిస్తానని, ఆయన గొప్పవాడని అంత కంటే తనకు ఏమీ తెలియదని చెప్పాడు. వివాదస్పదమైన సటానిక్‌ వర్సెస్‌ పుస్తకంలో కొన్ని పేజీలు చదివానని చెప్పాడు. రష్దీ మాత్రం మంచి వాడు కాదన్నాడు మాతార్‌. సల్మాన్‌ రష్దీ ముస్లింల మనోభావాలను దెబ్బతీశారని మండిపడ్డారు. న్యూయార్క్‌పోస్టుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాతార్‌ మాట్లాడుతూ రష్దీ న్యూయార్కులోని సాహితీ సభలో ప్రసంగించడానికి వస్తున్నాడని తెలుసుకొని ఒక రోజు ముందే బస్సులో బఫెలో నుంచి బయలు దేరానని చెప్పారు. ఒక రోజు ముందుగా సభా ప్రాంగణానికి వచ్చానని చెప్పుకొచ్చాడు. కాగా సల్మాన్‌ ప్రసంగించాలని లేవగానే పరుగు పరుగున వచ్చి మాతార్‌ రష్దీని పొడిచాడు. అటు తర్వాత హెలికాప్టర్‌లో రష్దీని ఆస్పత్రికి తరలించారు. వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. ప్రస్తుతం వెంటిలేటర్‌ తీసేశారు. ప్రాణాపాయం తప్పిందని డాక్టర్లు కూడా చెప్పారు.

గత సోమవారం మాతార్‌ తల్లి కూడా తన కుమారుడి గురించి మాట్లాడింది. లెబనీస్‌కు చెందిన సిల్వానా ఫార్‌డోస్‌ బ్రిటిష్‌ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కుమారుడి గురించి చెప్పింది. విడాకులు తీసుకొని ప్రస్తుతం లెబెనాన్‌లో ఉంటున్న తన మాజీ భర్త వద్దకు వెళ్లి వచ్చిన తర్వాత మాతార్‌ పూర్తిగా మారిపోయాడని, ఇస్లాం వైపు ఆకర్షితుడయ్యాడని పేర్కొంది. ఎవరితోను మాట్లాడకుండా గదిలో ఒక్కడే కూర్చుని ఆలోచించేవాడని కుమారుడి గురించి ఆమె తెలిపింది.

ఇవి కూడా చదవండి: