Home / అంతర్జాతీయం
పాల్లో ఘోర విమాన ప్రమాదం ( Plane Crash) చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో 72 మంది విమానంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు చాలామంది మృతి చెందినట్లు తెలుస్తోంది.
దేశ జనాభాలో కేవలం ఒక శాతం మాత్రమే ఉన్న ఇండియన్-అమెరికన్ కమ్యూనిటీ ఆరు శాతం పన్నులు చెల్లిస్తోందని యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు రిచ్ మెక్కార్మిక్ ప్రశంసించారు.
స్పోర్ట్స్‌వేర్ దిగ్గజం అడిడాస్ తన నాలుగు గీతల డిజైన్‌ను ఉపయోగించకుండా ఫ్యాషన్ డిజైనర్ థామ్ బ్రౌన్ ను ఆపాలంటూ చేసిన న్యాయపోరాటంలో ఓడిపోయింది.
ఆర్థిక సంక్షోభం మరియు ద్రవ్యోల్బణం కారణంగా పాకిస్తాన్లో చికెన్ ధర భారీగా పెరిగింది. గత రెండు వారాల్లో, కిలో చికెన్ ధర ఏకంగా రెండు వందల రూపాయలు పెరిగింది. ఇదే సమయంలో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందన్న భయం కూడా వ్యక్తమవుతోంది.
బ్యాంకింగ్ భాషలో డాలర్ విలువ ఓపెన్ మార్కెట్ రేట్లపై ఆధారపడి ఉంటుంది.పాకిస్థానీ బ్యాంకులు విదేశీ చెల్లింపుల కోసం 'ఓపెన్ మార్కెట్'లో డాలర్లను కొంటున్నాయి.
2019 ఈస్టర్ దాడిని నిరోధించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు బాధితులకు 310 మిలియన్ రూపాయల పరిహారం చెల్లించాలని శ్రీలంక మాజీ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన మరియు నలుగురు మాజీ ఉన్నతాధికారులను శ్రీలంక సుప్రీంకోర్టు ఆదేశించింది.
అమెరికాలో విమాన సర్వీసులను తిరిగి పునరుద్దరించారు. పైలట్లకు భద్రతా సమాచారాన్ని పంపే కంప్యూటర్ సిస్టమ్ విచ్ఛిన్నమై అమెరికా అంతటా విమాన సర్వీసులు నిలిచిపోయిన విషయం తెలిసిందే.
నందమూరి నటసింహ బాలకృష్ణ నటించిన తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’ నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. తెల్లవారుజాము నుంచే బెన్ఫిట్ షోలు వేయడంతో.. థియేటర్ల వద్ద అభిమానుల కోలాహాలం కనిపిస్తుంది.
ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) కంప్యూటర్ అంతరాయం కారణంగా యునైటెడ్ స్టేట్స్ అంతటా విమానాలు నిరవధికంగా నిలిపివేయబడ్డాయి, ఫిలడెల్ఫియా, టంపా మరియు హోనోలులు, ఆర్లింగ్టన్, వర్జీనియాలోని రోనాల్డ్ రీగన్ వాషింగ్టన్ విమానాశ్రయాల్లో విమానాలు నిలిచిపోయాయి.
ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్ట్ విషయానికి వస్తే జపాన్ నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది. వరుసగా ఐదో సంవత్సరం జపాన్ తన స్థానాన్ని పదిలం చేసుకుంది. జపాన్ ప్రపంచంలోని 193 దేశాలకు ఎలాంటి వీసా లేకుండా వెళ్లి రావచ్చు.