Site icon Prime9

Vijay Devarakonda: ఈడీ ముందు హాజరైన రౌడీ బాయ్.. లైగర్ విషయంలో విజయ్ పై విచారణ

ED to-question-vijay-deverakonda-regarding-liger-movie-remuneration

ED to-question-vijay-deverakonda-regarding-liger-movie-remuneration

Vijay Devarakonda: విజయ్ హీరోగా ఇటీవల కాలంలో విడుదలైన చిత్రం లైగర్‌. కాగా ఈ చిత్రం భారీ అంచనాల నడుము ప్రేక్షకుల ముందుకు వచ్చినా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా నిర్మాణంలో మనీ లాండరింగ్ జరిగిందన్న నేపథ్యంలో ఈడీ విచారణ కొనసాగుతోంది. ఈ సినిమా పెట్టుబడుల విషయమై ఎన్ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ అధికారులు విచారణ ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే కొద్దిరోజుల క్రితం ఈ చిత్ర దర్శక నిర్మాతలైన పూరీ జగన్నాథ్, చార్మీలను అధికారులు సుమారు12 గంటలపాటు విచారించారు. కాగా తాజాగా నేడు ఈ సినిమా హీరో అయిన విజయ్ దేవరకొండను కూడా విచరణకు పిలిపించారు.

ఛార్మీ, పూరీ జగన్నాథ్‌ల బ్యాంక్ ఖాతాల్లోకి పెద్ద ఎత్తున విదేశీ నగదు జమ అయిందన్న దానిపై అధికారులు విచారణ చేపట్టారు. ఇందులో భాగంగానే లైగర్‌ సినిమా రెమ్యునరేషన్‌, అడ్వాన్స్‌లపై నేడు హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో విజయ్‌ను విచారించనున్నారు అధికారులు. ఈ సినిమా నిర్మాణంలో విదేశాల నుంచి పలువురు రాజకీయ నేతల అకౌంట్‌ నుంచి డబ్బులు బదిలీ అయినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో విజయ్‌ని ఈడీ ప్రశ్నించనుంది.

ఇదిలా ఉంటే లైగర్ సినిమా విషయంలో డిస్ట్రిబ్యూటర్ల నుంచి పూరీకి బెదిరింపు కాల్స్ రావటం, దానికి పూరీ కూడా అంతే గట్టిగా కౌంటర్ ఇవ్వటం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి కూడా తెలిసిందే. మరి ఈడీ కేసు ఏ విధంగా మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.

ఇదీ చదవండి:  మంచి ఊపు తెప్పిస్తున్న “రంజితమే” తెలుగు పాట

Exit mobile version