Last Updated:

Thandel Movie: మరోసారి ఆర్టీసీ బస్సులో తండేల్‌ మూవీ ప్రదర్శన – బన్నీ వాసు రియాక్షన్‌!

Thandel Movie: మరోసారి ఆర్టీసీ బస్సులో తండేల్‌ మూవీ ప్రదర్శన – బన్నీ వాసు రియాక్షన్‌!

Thandel Movie Played Again in APSRTC: నాగ చైతన్య తండేల్‌ను పైరసీ వెంటాడుతూనే ఉంది. ఫిబ్రవరి 7న విడుదలైన మూవీకి ఫస్ట్‌ డేనే మంచి హిట్‌ టాక్‌ వచ్చింది. విడుదలైన తొలి రోజే ఈ సినిమా హెచ్‌డీ ప్రింట్‌ ఆన్‌లైన్‌లో లీక్‌ అయ్యింది. మరోవైపు సినిమాని పైరసీ చేసి లోకల్‌ ఛానళ్లో, ఆర్టీసీ బస్సు ప్రదర్శిస్తున్నారు. ఈ సినిమాను పైరసీకి పాల్పడిన వారిపై చట్టపరిమైన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీవాసు హెచ్చరించారు.

ఆర్టీసీ బస్సులు సినిమా ప్రదర్శించడంపై మూవీ టీం ఫైర్‌ అయ్యింది. దీనిపై ఏపీఆర్టీసీ ఎండీకి ఫిర్యాదు చేసినట్టు బన్నీ వాసు ట్వీట్‌ చేశారు. అయితే తాజాగా ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులో ఈ సినిమాను ప్రదర్శించారు. ఇది నిర్మాత బన్నీవాసు దృష్టికి వెళ్లడంతో ఆయన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఫిబ్రవరి 11న విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్లే బస్సులో తండేల్‌ సినిమాను ప్రదర్శించినట్లు తెలిపారు.

ఈమేరకు వీడియోతో పాటు బస్సు వివరాలను కూడా షేర్‌ చేశారు. ఈ సందర్భంగా ‘మా సినిమా పైరసీని రెండోసారి ఆర్టీసీ బస్సులో ప్రదర్శించారు. ఎంతో కష్టపడి సినిమా తీశాం. ఇలాంటి పనుల వల్ల చిత్ర పరిశ్రమకు నష్టం జరుగుతుంది. ఎంతోమంది క్రియేటర్స్‌ శ్రమను అగౌరపరడమే అవుతుంది’ అని రాసుకొచ్చారు. రెండోసారి ఏపీఎస్‌ ఆర్టీసీలోనే ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంతో అక్కినేని ఫ్యాన్స్‌ కూడా ఫైర్‌ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి: