HBD Garikapati Narasimharao : హ్యాపి బర్త్ డే గరికపాటి నరసింహరావు
తెలుగు రాష్ట్రాల్లో గరికపాటి నరసింహరావు అంటే తెలియని వాళ్లంటూ ఎవరు ఉండరు.ఎందుకంటే ఆయన ప్రవచనాలు చెప్పే విధానం కామెడిగా,అర్దం అయ్యి అవ్వనట్టుగా ఉంటాయి కాబట్టి.ఆయన సెప్టెంబర్ 14, 1958 తాడేపల్లి సమీపంలో ఉన్న బోడపాడు అగ్రహారం ఊరులో జన్మించారు.
HBD Garikapati Narasimharao : తెలుగు రాష్ట్రాల్లో గరికపాటి నరసింహరావు అంటే తెలియని వాళ్లంటూ ఎవరు ఉండరు.ఎందుకంటే ఆయన ప్రవచనాలు చెప్పే విధానం కామెడిగా,అర్దం అయ్యి అవ్వనట్టుగా ఉంటాయి కాబట్టి.ఆయన సెప్టెంబర్ 14, 1958 తాడేపల్లిగూడెం లోని బోడపాడు అగ్రహారం ఊరులో జన్మించారు.ఇప్పటికి ఆయన వయస్సు 64 ఏళ్లు ఐనా ఆయన ఎనర్జీ లెవెల్స్ ఏ మాత్రం తగ్గలేదు.ఆయనకు ఉన్న ప్రత్యేకత అంటే మాటలనే పద్యాలుగా చెబుతారు.గరికపాటి ప్రవచనాలు ఎక్కువుగా Svbc,భక్తి సమాచార టీవీ ఛానెల్స్ లో కనిపిస్తాయి.ఆయన రామాయణం పై ఎక్కువ ఉపన్యాసాలు ఇస్తుంటారు.ఈ మధ్య కాలంలో ఆయన వృత్తి పరంగా పద్మశ్రీ అవార్డును కూడా అందుకున్నారు.
నేడు గరికపాటి పుట్టిన రోజు సందర్బంగా ఆయన ప్రవచానాలలో ఒకటి చెప్పుకుందాం
మనిషి నమ్మకూడని మాటలు ఉంటాయని మనిషికి తెలుసా ?
మనిషిని కించపరిచే ఏ మాటలను కూడా నమ్మొద్దు అంటున్నారు.నీ శక్తిని తక్కువుగా అంచనా వేసే మాటలన్ని వట్టి మాటలే.ఎవరైనా నీ వల్ల ఏమి కాదు? నువ్వు దేనికి పనికి రావని మొహం మీద చెప్పేస్తారు ?అలాంటి వాళ్ళకు గరిక పాటి సమాధానం ఏంటంటే చెప్పడానికి అసలు నువ్వు ఏవరమ్మా ? నువ్వు మాట అనే వాళ్ళని కని,పెంచావా లేదు కదా మరి నీకెందుకమ్మా ? ఎవరైనా వచ్చి వాళ్ళ బాధలు నీ దగ్గర చెప్పుకుంటే నీకు నచ్చితే విను లేదంటే నాకు వినాలని లేదని చెప్పు అంతే కానీ నువ్వు ఎవరిని మాట అనకు.మనుషులు ముందు దేవుని విశ్వాసం ఆ తరువాత ఆత్మ విశ్వాసాన్ని పెంచుకోవాలని సందేశమిచ్చారు.