Saif Ali Khan: ‘నాన్న నువ్వు చనిపోతావా?’ అని తైమూర్ అడిగాడు.. దాడి ఘటనపై సైఫ్ కామెంట్స్!
Saif Ali Khan Revealed Taimur Reaction: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై ఇటీవల దాడి జరిగిన సంగతి తెలిసిందే. దొంగతనం కోసం ఇంట్లో చొరబడిన దుండగుడు సైఫ్‌పై కత్తితో దాడి చేసి పారిపోయాడు. గత జనవరి 16న జరిగిన ఈ సంఘటన బాలీవుడ్ సంచలనం రేపింది. దాడి అనంతరం ఆస్పత్రిలో చేరిన సైప్ వారం రోజుల్లో కోలుకుని ఇంటికి వచ్చారు. ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్న సైఫ్ ఇటీవల ఓ చానల్‌కి ఇంటర్య్వూలో ఇచ్చారు. ఆయనపై జరిగిన దాడి అనంతరం ఇదే ఆయన ఫస్ట్ ఇంటర్య్వూలో.
ఈ సందర్భంగా తన కుమారుడు తైమూర్ కామెంట్స్‌ని గుర్తు చేసుకున్నారు. దాడి జరిగిన సమయంలో కత్తితో పోడినట్టు తనకు తెలియదలేదన్నారు. దాడి తర్వాత చిన్న గాయం అయ్యింది అనుకున్నాను, అయితే కాసేపటికి వెన్నులో నొప్పి కలిగిందని, ఏంటని చూసుకుంటే అక్కడ కత్తిపోటు ఉన్నట్టు తెలిసిందన్నారు. “రాత్రి మేం పడుకున్న తర్వాత కాసేపటికి జేహ్ కేర్ టేకర్ అరుపు వినిపించింది. దీంతో కంగారుగా అక్కడికి వెళ్లాం. అక్కడ దొంగ కనిపించాడు. అతడిని పట్టుకుని గదిలో ఉంచే ప్రయత్నం చేశాను.
అతడు కత్తితో నాపై దాడి చేసి పారిపోయాడు. మొదట చిన్న గాయాలే అనుకున్నాను. కానీ కాసేపటికి నా వెన్నులో నొప్పిగా అనిపించింది. ఏంటాని చూసుకుంటే కత్తి పోటు ఉంది. అది చూస కరీనా చాలా కంగారు పడింది. అందరికి ఫోన్లు చేసింది. కానీ ఎవరూ తీయలేదు. తను ఒక బాధతో నన్ను చూసింది. ఇద్దరం కాసేపు చూసుకున్నాము. నేను బాగానే ఉన్నాను, నాకేం కాదని తనకి ధైర్యం ఇచ్చాను. అయితే, తైమూరు నా దగ్గరికి వచ్చి ‘నాన్న నువ్వు చనిపోతావా?’ అని అడిగాడు. అలా ఏం జరగదు అన్నాను” అని చెప్పుకొచ్చాడు.
ఇక సైఫ్ ఆస్పత్రికి వెళ్లినప్పుడ తనతో పాటు తైమూర్ కూడా ఉన్నట్టు లీలావతి వైద్యులు నివేదికలో పేర్కొన్నారు. ఇదే విషయాన్ని సైఫ్ చెబుతూ “దాడి జరిగిన తర్వాత తైమూర్ కాస్తా కూల్‌గా ఆలోచించాడు. ఆస్పత్రికి వెళ్తుంటే ‘నేనూ మీతో వస్తాను’ అని అడిగాడు. నేను కూడా ఒంటరిగా వెళ్లాలని అనుకోలేదు. అందుకే నాతోపాటు తైమూర్‌ను తీసుకువెళ్లాను. ఒకవేళ నాకు ఏమైనా జరిగినా ఆ సమయంలో నా కుమారుడు నా పక్కనే ఉండాలని అనుకున్నా” అని అన్నారు. అలా ముగ్గురు ఆటోనే ఆస్పత్రికి వెళ్లినట్టు చెప్పారు.