Published On:

Thandel Collection: తగ్గేదే లే అంటున్న ‘తండేల్‌’ – రెండు రోజుల కలెక్షన్స్‌ ఎంతంటే!

Thandel Collection: తగ్గేదే లే అంటున్న ‘తండేల్‌’ – రెండు రోజుల కలెక్షన్స్‌ ఎంతంటే!

Thandel Box Office Collections: నాగ చైతన్య తండేల్‌ మూవీ ప్రస్తుతం హిట్‌ టాక్‌తో దూసుకుపోతోంది. రిలీజ్‌కు ముందే పాటలు, మ్యూజిక్‌తో మంచి బజ్‌ క్రియేట్‌ అయ్యింది ఈ మూవీ. ఇక ఎన్నో అంచనాల మధ్య ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఫస్ట్‌ షో నుంచి పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. నాగ చైతన్య యాక్టింగ్‌ బాగా ఆకట్టుకుంటుందని, ఎమోషన్స్‌ సీన్స్‌లో ఏడిపించాడంటున్నారు ఆడియన్స్‌. ఇక సాయి పల్లవి ఎప్పటిలాగే అదరగొట్టిందని, ఆమె యాక్టింగ్‌ నెక్ట్స్‌ లెవల్లో ఉందంటున్నారు.

ఇక చందూ మొండేటి టేకింగ్‌కి సినీ ప్రముఖులు సైతం ఫిదా అవుతున్నారు. ఈ సినిమాకు ఇంత బాగా సక్సెస్‌ అవ్వడానికి దేవిశ్రీ సంగీతం కీలకమైందనే చెప్పాలి. ఎడబాటులో ఉన్న ప్రేమికుల బాధకు దేవి తన మ్యూజిక్‌తో మరింత ప్రాణం పోశాడని, పాటలు హృదయాన్ని తాకుతున్నాయంటూ ఆడియన్స్‌ నుంచి రివ్యూలు వస్తున్నాయి. ఓవరాల్‌ సినిమా ప్రతి ఒక్క ఆడియన్‌ని ఆకట్టుకోవడం వసూళ్లు కూడా అదే రేంజ్‌లో వస్తున్నాయి. ఫస్ట్‌ డే ఈ సినిమా రూ. 21.27 కోట్ల గ్రాస్‌ వసూళ్లు చేసి నాగ చైతన్య కెరీర్‌లో హయ్యేస్ట్‌ ఓపెనింగ్స్‌ ఇచ్చిన చిత్రంగా నిలిచింది.

ఇక రెండవ రోజు కూడా అదే జోరు కొనసాగించింది. రెండు రోజుల్లో ఈ సినిమా రూ. 41.20 కోట్ల గ్రాస్‌ చేసింది. ఈ విషయాన్ని తాజాగా మూవీ టీం ప్రకటించింది. ఇక ఆదివారం సెలవు కావడంతో మూడో రోజు కలెక్షన్స్‌ కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మూడు రోజుల్లోనే ఈ సినిమా రూ. 50 కోట్ల మార్క్‌ దాటేస్తుందని ట్రేడ్‌ వర్గాలు అంటున్నాయి. కాగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను అల్లు అరవింద్‌ సమర్పణలో గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మించారు.

ఇవి కూడా చదవండి: