Last Updated:

Golden Globe Awards 2023 : గేయ రచయిత చంద్రబోస్ గురించి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఆసక్తికర పోస్ట్

వాల్తేరు వీరయ్య సినిమా టైటిల్ సాంగ్ పైన యండమూరి వీరేంద్రనాధ్ చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చి ట్రెండింగ్ లో ఉన్న చంద్రబోస్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. అయితే ఈసారి అలాంటి నెగిటివ్ వార్త కాదు.

Golden Globe Awards 2023 : గేయ రచయిత చంద్రబోస్ గురించి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఆసక్తికర పోస్ట్

Golden Globe Awards 2023 : వాల్తేరు వీరయ్య సినిమా టైటిల్ సాంగ్ పైన యండమూరి వీరేంద్రనాధ్ చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చి ట్రెండింగ్ లో ఉన్న చంద్రబోస్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. అయితే ఈసారి అలాంటి నెగిటివ్ వార్త కాదు. అంతర్జాతీయ అవార్డుకి నామినేట్ అయ్యిన వార్త. టైటిల్ సాంగ్ అయినా… హీరో హీరోయిన్ల మధ్య డ్యూయెట్ అయినా… తనదైన శైలిలో పూర్తి అవగాహనతో పదాలంకరణ చేస్తారు చంద్రబోస్.

తాజాగా గోల్డెన్ గ్లోబ్ అవార్డు కి గాను గేయ రచయిత చంద్రబోస్ నామినేట్ అయినట్టు ఆ సంస్థ తమ ఇంస్టాగ్రామ్ ఖాతా నుండి వెల్లడించింది. ఇప్పటికే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన ఈ అవార్డు ఫంక్షన్ కి హాజరు కావడానికి లాస్ ఏంజెల్స్ కి చేరుకున్నారు. ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ సినిమాలో నాటు నాటు పాట రచించిన చంద్రబోస్ కూడా నామినేట్ అయ్యారు. ఇప్పటికే రెండు కేటగిరిల్లో రాజమౌళికి నామినేషన్లు దక్కాయి.

టామ్ క్రూస్, విల్ స్మిత్, లియోనార్డో డికాప్రియో లాంటి హాలీవుడ్ నటులు హాజరయిన వేదిక మీద మొట్ట మొదటి సారి తెలుగు వారు నిలబడటం విశేషం. ఆర్.ఆర్.ఆర్ కి ముందు కేవలం 5 ఇండియన్ సినిమాలకే ఈ గౌరవం దక్కింది. అవి కూడా ఇప్పటి సినిమాలు కాదు. గత ఐదు ఏళ్లగా ఈ లిస్ట్ లో ఒక్క ఇండియన్ సినిమా కూడా లేకపోవడం. ఆర్.ఆర్.ఆర్ తో మళ్ళి ఆ గౌరవం ఇండియన్ సినిమాకి దక్కినట్టు భావిస్తున్నారు. దర్శకుడు వి శాంతారామ్ యొక్క దో అంఖేన్ బరాహ్ హాత్ గోల్డెన్ గ్లోబ్స్‌లో నామినేట్ అయిన మొదటి భారతీయ చిత్రం. 1957 లో ఈ చిత్రం విడుదల అయ్యింది.

 

ఇవి కూడా చదవండి: