Chiranjeevi: మొగల్తూరు స్థలంపై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు

Chiranjeevi: సంక్రాంతి వచ్చిందంటే చాలు.. పెద్ద సినిమాలు బాక్స్ ఆఫిస్ వద్ద హంగామా చేస్తాయి. ఇక ప్రస్తుత కాలంలో తమ సినిమాకు మరింత ఊపు తెచ్చేందుకు చిత్ర బృందం వివిధ రకాలుగా ప్రమోషన్స్ చేస్తున్నాయి. అందులో భాగంగానే వాల్తేరు వీరయ్య ప్రమోషన్స్ లో భాగంగా చిరంజీవి (Chiranjeevi) పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవి ఏంటో ఇపుడు చుద్దాం.

 

ఏంటీ ఈ స్థల వివాదం

చిరంజీవి గురించి తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా చెప్పనక్కర్లేదు. సామాజిక సేవతో పాటు.. ఎన్నో కార్యక్రమాలకు చిరంజీవి శ్రీకారం చుట్టారు. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ వంటి సేవా కార్యక్రమాలతో ఎంతో మందికి ప్రత్యక్షంగా.. పరోక్షంగా సాయపడ్డారు. చిరంజీవి చేసే సాయం ఎలాంటిది అది పొందిన వారికే తెలుసని ఇండస్ట్రీలో చాలా మంది అంటుంటారు. అలాగే కొన్ని సందర్భాలలో చిరంజీవి విమర్శలు సైతం ఎదుర్కొన్నారు. అందులో మెుదటిది మెుగల్తురులో ని ఓ స్థలం.

చిరంజీవి ఏమన్నారంటే?

ఈ స్థలాన్ని లైబ్రరీకి ఇవ్వాల్సిందిగా అక్కడివారు అడిగారట. కానీ చిరంజీవి ఆ స్థలాని అమ్ముకున్నారని విమర్శలు వచ్చాయి. ఈ స్ధలం గురించి ఓ ఇంటర్య్వూలో అడిగిన ఈ ప్రశ్నకు చిరంజీవి సమాధానం ఇచ్చారు. ఆ స్థలం పై విమర్శలు ఎందుకొచ్చాయి. వాటిపై చిరంజీవి ఏమన్నారో తెలుసా?. తనపై వ్యక్తిగతంగా బురద చల్లేందుకే  అలాంటి ప్రచారం చేశారని.. అందులో ఎలాంటి వాస్తవం లేదని ఆయన అన్నారు.

అది ఎవరి ఆస్తి మరి

నిజానికి అది తన ఆస్తి కాదని.. తన మామయ్య ఆస్తి అని ఆయన చెప్పుకొచ్చారు. అక్కడి ఉండి చదువుకున్నానే తప్పా.. అది తమ స్వంత ఆస్తి కాదని అన్నారు. ఈ ఇంటి స్థలం అమ్మకం
విషయం తన వరకు రాలేదని చిరంజీవి తెలిపారు. తన స్వంత డబ్బుతో మెుగల్తురూలోనే లైబ్రరీ నిర్మించినట్లు మెగాస్టార్ తెలిపారు.

 

మెుగల్తురూలో ఇప్పుడు ఆ ఇల్లు లేదని.. తన మామయ్య ఆ ఇంటిని అమ్మేశారని తెలిపారు. కేరీర్ ప్రారంభంలోనే తన వాళ్లతో చెన్నై వచ్చేసినట్లు చిరంజీవి తెలిపారు.

 

ఇవి కూడా చదవండి…

సైలెంట్‌గా ఉపాసన ఎంట్రీ.. భార్యను రాంచరణ్ ఎలా పరిచయం చేశాడో చూడండి..

ఈ ఏడాది హాట్ స్టార్ కి షాక్.. ఆ ఓటీటీలో ఐపీఎల్ స్ట్రీమింగ్.. ఎన్ని భాషల్లో అంటే?

గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో సత్తా చాటిన ఆర్ఆర్ఆర్.. బెస్ట్ సాంగ్ గా “నాటు నాటు”

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: http://Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/