Big Boss 9: బిగ్ బాస్ 9లో సామాన్యులకు అవకాశం.. మీరు హౌజ్ లోకి వెళ్లాలంటే ఈ పనిచేయాలి

Big Boss 9: టాలీవుడ్ సూపర్ స్టార్ కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ షో ఇప్పుడు 9వ సీజన్ కు స్వాగతం చెబుతోంది. ఇప్పటికే బిగ్ బాస్ దేశవ్యప్తంగా అన్ని భాషలలో నడుస్తోంది. తెలుగులో నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ షోకు.. 9వ సీజన్ కు గాను కంటెస్టెంట్స్ ను ఎంపిక చేస్తుంది. ఈ సారి కప్పు గెలవాలంటే భారీ యుద్దమే చేయాలంటున్నారు నాగార్జున. చదరంగం కాదు.. ఈ సారి రణరంగం అంటూ ప్రమోషన్ వీడియోను రిలీజ్ చేశారు.
“ఇప్పటి వరకు మీరు బిగ్ బాస్ తెలుగును ఎంతగానో ప్రేమించారు. ఇంతటి ప్రేమను ఇచ్చిన మీకు రిటర్న్ గిఫ్ట్ గా ఏమిస్తే బాగుంటుంది. అందుకే మీరు ఎంతగానో ప్రేమించిన బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీని రిటర్న్ గిఫ్ట్ ను ప్లాన్ చేశాం. ఈ సారి హౌజ్ లోకి సెలబ్రిటీలే కాదు. సాధారణ మనుషులకు కూడా ఎంట్రీ ఉంది. వచ్చేయండి.. బిగ్ బాస్ 9 తలుపులు మీకోసం ఎదురుచూస్తున్నాయి.” అని నాగార్జున ప్రకటించారు. ఇందుకోసం bb9.jiostar.com వెబ్ సైట్ లో రిజిస్టర్ అయి. బిగ్ బాస్9లో పాల్గొనడాని కారణం చెప్పి వీడియోను అప్ లోడ్ చేయాలని తెలిపారు.
ఈసారి నాగార్జునకు బదులుగా బాలయ్యను హోస్ట్ గా పెడతారని టాక్ నడిచింది. కానీ ఇప్పుడు నాగార్జున సీజన్9 ను పరిచయం చేయడంతో బిగ్ బాస్9 కు బాస్ నాగార్జునేనని తేలింది. ప్రస్తుతం బిగ్బాస్9 హౌజ్ మేట్స్ ఎంపిక జరుగుతోంది. ఇప్పటికే పలువురిని ఎంపికను చేస్తున్నట్లు తెలుస్తోంది.