Balagam On OTT: బలగం ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే..
బలగం సినిమా.. ప్రజెంట్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ చిత్రం. కమెడియన్ వేణు డైరెక్షన్ లో వచ్చిన మంచి ఫీల్ గుడ్ మూవీ బలగం. ఈ మూవీని దిల్ రాజు నిర్మించారు.

Balagam On OTT: బలగం సినిమా.. ప్రజెంట్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ చిత్రం. కమెడియన్ వేణు డైరెక్షన్ లో వచ్చిన మంచి ఫీల్ గుడ్ మూవీ బలగం. ఈ మూవీని దిల్ రాజు నిర్మించారు. మామూలుగా కమెడియన్ డైరెక్టర్ గా మారితే అతడి నుంచి కామెడీ కథనే ఎక్స్ పెక్ట్ చేస్తారు. కానీ అందుకు భిన్నంగా ఓ బలమైన కథతో మెప్పించాడు వేణు. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ , సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ లు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.
ఓటీటీ వేదికగా అలరించేందుకు(Balagam On OTT)
ఈ సినిమాలో తెలంగాణ పల్లె జీవితాలను, మనుషుల మధ్య బంధాలను ఆవిష్కరించిన తీరు ఎంతగానో ఆకట్టుకుంది. ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలతో పాటు కలెక్షన్లు కూడా వచ్చాయి. దర్శకుడిగా హాస్యనటుడు వేణు విజయం అందుకున్నారు. అయితే థియేటర్ లో విశేషంగా ఆకట్టుకున్న ఈ చిత్రం ఇపుడు ఓటీటీ వేదికగా అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో, సింప్లీ సౌత్ ఓటీటీ ఫ్లాట్‌ఫాంలపై మార్చి 24 తేదీ నుంచి బలగం స్ట్రీమింగ్ కానుంది. ఇతర దేశాల్లో ఉన్న భారతీయులు, ముఖ్యంగా తెలుగువాళ్లు సింప్లీ సౌత్‌లో ఈ సినిమాను వీక్షించవచ్చు.
చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం మంచి లాభాలు రాబట్టింది. కాగా ఇది వరకే మల్లేశం సినిమాతో నే తన సత్తా ఏంటో నిరూపించుకున్న ప్రియదర్శి బలగంలో తెలంగాణ యువకుడిగా నటించాడు. ప్రియదర్శి తాత పాత్రలో సుధాకర్ రెడ్డి జీవించాడు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది.
ఇవి కూడా చదవండి:
- Polavaram Project: పోలవరం ఎత్తుపై కేంద్రం కీలక ప్రకటన
- woman ticket checker: కోటి రూపాయలకు పైగా జరిమానా వసూలు చేసిన మొదటి మహిళా టిక్కెట్ తనిఖీ అధికారి