Last Updated:

Balagam Movie: అంతార్జాతీయ వేదికపై కూడా ‘బలగం’ చూపించింది

తెలంగాణ పల్లె జీవితాలను, మనుషుల మధ్య బంధాలను ఈ సినిమాలో ఆవిష్కరించిన తీరు ఎంతగానో ఆకట్టుకుంటుంది.

Balagam Movie: అంతార్జాతీయ వేదికపై కూడా ‘బలగం’ చూపించింది

Balagam Movie: కమెడియన్ వేణు డైరెక్షన్ లో వచ్చిన మంచి ఫీల్ గుడ్ మూవీ బలగం. ఈ మూవీని దిల్ రాజు నిర్మించారు. మామూలుగా కమెడియన్ డైరెక్టర్ గా మారితే అతడి నుంచి కామెడీ కథనే ఎక్స్ పెక్ట్ చేస్తారు. కానీ అందుకు భిన్నంగా ఓ బలమైన కథతో మెప్పించాడు వేణు. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ , సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ లు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.

ప్రశంసలతో పాటు కలెక్షన్లు

తెలంగాణ పల్లె జీవితాలను, మనుషుల మధ్య బంధాలను ఈ సినిమాలో ఆవిష్కరించిన తీరు ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలతో పాటు కలెక్షన్లు కూడా వచ్చాయి. దర్శకుడిగా హాస్యనటుడు వేణు విజయం అందుకున్నారు. మార్చి 3న విడుదలై థియేటర్ లో విశేషంగా ఆకట్టుకున్నబలగం ఇపుడు ఓటీటీ వేదికగా కూడా అలరిస్తోంది. దిల్‌రాజు ప్రొడెక్షన్స్‌ పతాకంపై హర్షిత్‌, హన్షిత ఈ సినిమాను నిర్మించారు.

ఇంటర్నేషనల్ వేదికపై

కాగా ప్రత్యేక ఘనతను సాధించిన బలగం సినిమా ఇంటర్నేషనల్ వేదికపై కూడా తన సత్తా ఏంటో చూపెట్టింది. లాస్‌ ఏంజిల్స్‌ సినిమాటోగ్రఫీ అవార్డులను సినిమా రంగంలో ఎంతో ప్రత్యేకంగా భావిస్తారు. అలాంటి కార్యక్రమంలో బలగం సినిమా రెండు అవార్డులు సొంతం చేసుకుంది. ‘బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌’ విభాగంలో డైరెక్టర్ వేణు, ‘బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ సినిమాటోగ్రఫీ’ సెగ్మెంట్ లో ఆచార్య వేణు ఈ అవార్డులను దక్కించుకున్నారు. బలగం సినిమాకు అవార్డులు వచ్చిన విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ దిల్‌రాజు ప్రొడెక్షన్స్‌ ట్వీట్‌ చేసింది. ఈ సందర్భంగా దర్శకుడు, సినిమాటోగ్రాఫర్‌కు అభినందనలు తెలిపింది.