Allu Aravind: ‘తండేల్’ ఈవెంట్‌లో చరణ్‌పై అలాంటి కామెంట్స్ – వివరణ ఇచ్చిన అల్లు అరవింద్
Allu Aravind Reacts on Game Changer Controversy: అగ్ర నిర్మాత అల్లు అరవింద్ మెగా అభిమానులకు క్షమాపణలు చెప్పారు. తండేల్ ఈవెంట్‌లో ఆయన చేసిన కామెంట్స్‌పై తాజాగా వివరణ ఇచ్చారు. తండేల్ మూవీ పైరసీపై మూవీ టీం ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ.. తండేల్ మూవీ ప్రమోషన్స్‌లో నేను రామ్ చరణ్‌ని తగ్గించి మాట్లాడాననే అభియోగంతో నన్ను ట్రోల్ చేశారు. దీనిపై ఓ సీనియర్ జర్నలిస్ట్ కూడా ప్రశ్నించారు. సందర్భంగా వచ్చినప్పుడు చెప్తానన్నారు. అందుకు ఇప్పుడు మీకు దీనిపై వివరణ ఇవ్వాలని అనుకుంటున్నా అన్నారు.
పబ్లిక్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే.. ఆ రోజు దిల్ రాజును ఆహ్వానిస్తూ ఆయన ఒక్క వారం రోజుల్లోనే కష్టాలు, నష్టాలు, ఇన్‌కమ్ ట్యాక్స్‌లు అనుభవించారనే దాన్ని గురించి యాధృచ్చికంగా ఆ మాట అనాల్సి వచ్చింది. దానికి మెగా ఫ్యాన్స్ ఫీలైపోయి చరణ్ తగ్గించానని అనుకుని నన్ను ట్రోల్ చేశారు. చరణ్ నా కొడుకు లాంటి వాడు. నాకున్న ఏకైక మేనల్లుడు. నేను ఆయనకు ఉన్న ఏకైక మేనమామని. మా ఇద్దరి మధ్య మంచి బంధం ఉంది. మా మధ్య అద్భుతమైన అనుబంధం ఉంటుంది. ఎమోషన్‌గా చెప్తున్న ఇక్కడితో దీన్ని వదిలేయండి.
దిల్ రోజు లైఫ్ చెప్పడానికి మాత్రమే అలా అన్నాను. కానీ దాన్ని అనకుండ ఉండాల్సింది. ఇక్కడితో దీన్ని వదిలేయండి” అని చెప్పుకొచ్చారు. తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి దిల్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ ఆయనను స్టేజ్‌పైకి పిలిచిన అనంతరం ఒక సినిమాను పడకోబెట్టి, ఒక సినిమాను ఎక్కడిగో తీసుకువెళ్లి.. ఆ తర్వాత ఇన్‌కమ్ ట్యాక్స్ వారిని ఆహ్వానించి ఒక్క వారంలోనే ఎంతో చూశాడు అంటూ సరదగా కామెంట్స్ చేశారు. అయితే ఒక సినిమాను పడుకోబెట్టి అంటే అది అంతా గేమ్ ఛేంజర్ మూవీని ఉద్దేశించి చేశారని మెగా అభిమానులు మండిపడ్డారు.
దీంతో అల్లు అరవింద్‌ని ట్రోల్ చేస్తూ, విమర్శిస్తూ కామెంట్స్ చేశారు. కాగా ఈ సంక్రాంతికి దిల్ రాజు బ్యానర్ నుంచి రెండు సినిమాలు విడుదలయ్యాయి. అందులో ఒకటి గేమ్ ఛేంజర్ మూవీ కాగా మరోకటి సంక్రాంతికి వస్తున్నాం. జనవరి 10న రిలీజైన గేమ్ ఛేంజర్ మూవీ ఆశించిన సక్సెస్ అందుకోలేకపోయింది. ఆ తర్వాత జనవరి 14న విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. రెట్టింపు వసూళ్లతో నిర్మాతలకు డబుల్ ప్రాఫిట్స్ అందించింది ఈ సినిమా.