TS Inter Supplementary Results : నేడు విడుదల కానున్న తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గత కొద్ది రోజులుగా ఎదురు చూస్తున్న రోజు వచ్చేసింది. తాజాగా తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను విడుదల చేస్తున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారికంగా ప్రకటించింది. ఈ క్రమంలోనే నేడు (శుక్రవారం, జూలై 7) మధ్యాహ్నం 2 గంటలకు
TS Inter Supplementary Results : తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గత కొద్ది రోజులుగా ఎదురు చూస్తున్న రోజు వచ్చేసింది. తాజాగా తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను విడుదల చేస్తున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారికంగా ప్రకటించింది. ఈ క్రమంలోనే నేడు (శుక్రవారం, జూలై 7) మధ్యాహ్నం 2 గంటలకు ఫస్ట్ ఇయర్‌తో పాటు, సెకండ్ ఇయర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు ఫలితాలను అధికారులు విడుదల చేయనున్నారు. విద్యార్థులు తమ ఫలితాలను https://tsbie.cgg.gov.in మరియు https://results.cgg.gov.in/ వెబ్‌సైట్‌లలో చూడొచ్చని తెలిపారు.
ఈ ఏడాది జరిగిన ఇంటర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాల్లో ప్రథమ సంవత్సరంలో 63.85 శాతం ఉత్తీర్ణత సాధించగా.. ద్వితీయ సంవత్సరంలో 67.26 శాతం ఉత్తీర్ణత సాధించారు. ప్రథమ సంవత్సరంలో బాలురు 54.66 శాతం ఉత్తీర్ణత సాధిస్తే.. బాలికలు 68.68% ఉత్తీర్ణులయ్యారు. అలాగే ద్వితీయ సంవత్సరంలో బాలురు 55.60% ఉత్తీర్ణులైతే, బాలికలు 71.57 శాతం ఉత్తీర్ణత సాధించడం గమనార్హం. ఇంటర్ రెగ్యులర్ పరీక్షలకు మొత్తం 9,48,153 మంది హాజరయ్యారు.
ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు ఇంటర్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. కాగా ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లీ పరీక్షలను.. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 933 పరీక్షా కేంద్రాల్లో.. జూన్ 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. మొదటి, రెండవ సంవత్సరం కలిపి మొత్తం 4,12,325 మంది ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఫస్ట్ ఇయర్ లో 2,70,583 మంది, సెకండ్ ఇయర్ లో 1,41,742 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. అలాగే ప్రాక్టికల్స్‌ను జూన్ 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నిర్వహించారు. దీంతో ఈ ఫలితాల కోసం విద్యార్ధులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.