Last Updated:

Daily Horoscope : నేడు ఈ రాశుల లోని వారికి సన్నిహితులతో వివాదాలు పరిష్కారం అవుతాయని తెలుసా..!

జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారికి సన్నిహితులతో వివాదాలు పరిష్కారం అవుతాయని తెలుస్తుంది. అలాగే అక్టోబర్ 17 న  రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..

Daily Horoscope : నేడు ఈ రాశుల లోని వారికి సన్నిహితులతో వివాదాలు పరిష్కారం అవుతాయని తెలుసా..!

Daily Horoscope : జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారికి సన్నిహితులతో వివాదాలు పరిష్కారం అవుతాయని తెలుస్తుంది. అలాగే అక్టోబర్ 17 న  రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..

మేషం..

పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా కలిసి వస్తాయి. ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశం ఉంది. వ్యాపారాలు సానుకూలంగా సాగుతాయి. పిల్లలు చదువుల్లో పైకి వస్తారు. సతీమణిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

వృషభం..

సన్నిహితులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో సానుకూల మార్పులు జరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. కొత్త ఆలోచనలు, కొత్త ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. కుటుంబ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

మిథునం..

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. మొండి బాకీలు కూడా వసూలు అవుతాయి. ఉద్యోగంలో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు బాగా రాణిస్తాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. సతీమణికి మంచి గుర్తింపు లభిస్తుంది.

కర్కాటకం..

ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్లో కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. తల్లి ఆరోగ్యం కాస్తంత ఆందోళన కలిగి స్తుంది.

సింహం..

రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ముఖ్య వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాలలో ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. పిల్లలు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు.

కన్య..

అదనపు ఆదాయ ప్రయత్నాల వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలను మరింత జాగ్రత్తగా నిర్వహించడం అవసరం. ప్రయాణాలు, ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా, సామరస్యంగా సాగిపోతుంది. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగు తుంది.

తుల..

ఉద్యోగ జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. తోబుట్టువులతో ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు వస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దైవ కార్యాలు, శుభ కార్యాల మీద బాగా ఖర్చు చేస్తారు. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి.

వృశ్చికం..

కొన్నివ్యక్తిగత, కుటుంబ సమస్యలు అనుకోకుండా పరిష్కారం అవుతాయి. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఆర్థిక సంబంధమైన వ్యవహారాలు, ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది.

ధనస్సు..

మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. ఆర్థిక సమస్య పరిష్కారం అవుతుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు తగిన ఆఫర్లు అందుతాయి. కుటుంబ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి.

మకరం..

నిరుద్యోగులకు అవకాశాలు కలిసి వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడం మంచిది. చేపట్టిన వ్యవహారాలు, పనులు, ప్రయత్నాలు చాలా వరకు సంతృప్తికరంగా పూర్తవు తాయి. ప్రయాణాలు, ఆరోగ్య విషయాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి.

కుంభం..

పిల్లల నుంచి, సతీమణి నుంచి శుభవార్తలు వింటారు. స్వల్ప అనారోగ్యాలకు అవకాశం ఉంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చవద్దు. పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది.

మీనం..

వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నవారు ఒక మెట్టు పైకి ఎక్కే అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాలు అను కూలంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితులు బాగా అనుకూలంగా మారతాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.