Last Updated:

TDP Leader Murder: కర్నూలు జిల్లాలో టీడీపీ నాయకుడి దారుణహత్య

కర్నూలు జిల్లా వెల్దురి మండలం బొమ్మిరెడ్డిపల్లె గ్రామంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. టిడిపి నాయకుడు గిరినాథ్ చౌదరిని దారుణంగా హత్య చేశారు. ఆయన సోదరుడు కళ్యాణ్ కూడా తీవ్రంగా గాయపడ్డారు.

TDP Leader Murder: కర్నూలు జిల్లాలో టీడీపీ నాయకుడి దారుణహత్య

 TDP Leader Murder: కర్నూలు జిల్లా వెల్దురి మండలం బొమ్మిరెడ్డిపల్లె గ్రామంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. టిడిపి నాయకుడు గిరినాథ్ చౌదరిని దారుణంగా హత్య చేశారు. ఆయన సోదరుడు కళ్యాణ్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. నిన్న సాయంత్రం తమ పనులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా.. మాటు వేసిన వైసీపీ వర్గీయులు వెంటాడి వేట కొడవళ్లతో దాడి చేశారు. తీవ్ర కత్తిపోట్లకు గురైన గిరినాథ్, కళ్యాణ్ లను వెల్దుర్తి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే గిరినాథ్ చనిపోయారు.

తీవ్రంగా గాయపడ్డ సోదరుడు..( TDP Leader Murder)

తీవ్రంగా గాయపడిన కళ్యాణ్ ను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హత్య గురించి తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ బొమ్మిరెడ్డిపల్లె గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. తిరిగి ఎలాంటి దాడులు జరగకుండా బందోబస్తు నిర్వహించాలని ఆదేశించారు.

ఇవి కూడా చదవండి: