Last Updated:

IBM AI: 7800 మంది ఉద్యోగాల స్థానంలో ఏఐ సేవలు.. ఐబీఎం కీలక నిర్ణయం

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడటం రోజురోజుకీ పెరుగుతోంది. ఉద్యోగాల కోతకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కుడ అడ్డుపడుతుందో అని టెక్ నిపుణుల

IBM AI: 7800 మంది ఉద్యోగాల స్థానంలో ఏఐ సేవలు.. ఐబీఎం కీలక నిర్ణయం

IBM AI: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడటం రోజురోజుకీ పెరుగుతోంది. ఉద్యోగాల కోతకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కుడ అడ్డుపడుతుందో అని టెక్ నిపుణుల నుంచి ఓవైపు ఆందోళనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. మరోవైపు ఈ అత్యాధునిక టెక్నాలజీ తో రోజురోజుకీ సరికొత్త మార్పులు వస్తున్నాయి. భవిష్యత్తులో అనేక ఉద్యోగాల్లో ఏఐ ప్రభావం చూపుతుందనే అంచనాలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ టెక్‌ కంపెనీ ఐబీఎం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

 

రానున్న ఐదేళ్లలో 7,800 మంది(IBM AI)

రానున్న ఐదేళ్లలో కంపెనీలోని చాలా వరకు ఉద్యోగాల ప్లేసులో ఏఐను ఉపయోగించాలని ఐబీఎం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయా భాగాల్లో కొత్త ఉద్యోగులను తీసుకోవడం నిలిపివేయనున్నట్టు తెలుస్తోంది. అందుకు సంబంధించిన మార్పులను చేయాలని ఆయా విభాగాల ఉన్నత ఉద్యోగులకు కంపెనీ సీఈఓ అర్వింద్‌ కృష్ణ సూచించినట్టు బ్లూమ్‌బెర్గ్‌ కథనం ప్రచురించింది.

ఐబీఎంలో దాదాపు 7,800 మంది ఉద్యోగుల స్థానంలో ఏఐని వినియోగించే అవకాశాలు ఉన్నట్టు తాను అనుకుంటున్నట్టు ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఐబీఎం సీఈఓ చెప్పారని బ్లూమ్‌బెర్గ్‌ పేర్కొంది. అయితే, ఐబీఎం ఉద్యోగులను తొలగిస్తూనే మరోవైపు నియామకాలను కూడా కొనసాగిస్తోంది. తొలి త్రైమాసికంలో దాదాపు 7000 మంది కొత్త వారిని తీసుకున్నట్టు సీఈఓ తెలిపారు.

 

దిగ్గజ కంపెనీల్లో ఏఐ సేవలు(IBM AI)

కాగా, అమెజాన్‌ లాంటి పలు దిగ్గజ కంపెనీలు ఇటీవల హెఆర్ విభాగంలో పెద్ద ఎత్తున ఉద్యోగాల కోతలు విధించాయి. వారి స్థానంలో ఏఐ ను వినియోగించుకుంటున్నాయి. ఖర్చులను తగ్గించుకునే నేపథ్యంలోనే కంపెనీలు ఈ విధంగా అడుగులు వేస్తున్నాయి. వ్యయాలను నియంత్రించుకునేందుకు ఇప్పటికే ఐబీఎం పలు కఠిన నిర్ణయాలు తీసుకుంది. జనవరి లో 4,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. దాంతో పాటు కొన్ని వ్యాపార విభాగాలను పూర్తిగా తీసివేసింది.