Gas Cylinder: దేశంలో తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు

Commercial Cylinders Prices Reduced: దేశవ్యాప్తంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నేటి నుంచి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాయని ప్రకటించాయి. 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరపై రూ. 58.50 ధరను తగ్గించాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం సిలిండర్ ధర రూ. 1723 నుంచి రూ. 1665 కు తగ్గింది. మారిన గ్యాస్ ధర ప్రకారం కోల్ కతాలో రూ. 1769, చెన్నైలో రూ. 1822 గా ఉంది.
మరోవైపు గృహ వినియోగదారులు వాడే 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇక డొమెస్టిక్ సిలిండర్ ధర మార్కెట్లో రూ. 855.50 గా కొనసాగుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ లోనే సిలిండర్ ధరపై రూ. 50 పెరిగిన విషయం తెలిసిందే. దీంతో సామాన్య ప్రజలకు ఆయిల్ కంపెనీలు ఎలాంటి గుడ్ న్యూస్ చెప్పలేదు. తాజాగా కమర్షియల్ సిలిండర్ ధర తగ్గడంతో హెటల్స్, రెస్టారెంట్లు, బేకరీస్, వాణిజ్య సంస్థలకు కొంత ఉపశమనం కలగనుంది. తాజా తగ్గింపు వ్యాపార వర్గాలకు కొంత అనుకూలంగా ఉండనుంది.