Tollywood: సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల నివాళులర్పిస్తూ నిర్మాతల మండలి రేపు షూటింగ్స్ కు బంద్ ప్రకటించింది. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కృష్ణ నేడు తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ఈ వార్తతో కృష్ణ కుటుంబ సభ్యులతో పాటు యావత్ సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది.
కృష్ణ మరణ వార్త తెలిసిన అభిమానులు, తెలుగు చిత్ర పరిశ్రమ తమ అభిమాన నటుడు సినీదిగ్గజాన్ని కడసారి చూసేందుకు నానక్ రామ్ గూడ లోని ఆయన స్వగృహానికి చేరుకుంటున్నారు. పలువురు సినీరాజయకీయ ప్రముఖులు ఇప్పటికే కృష్ణ భౌతికకాయానికి అశ్రునివాళులు అర్పించారు. రేపు ఉదయం అభిమానుల సందర్శనార్థం కృష్ణ పార్థివదేహాన్ని గచ్చిబౌలిలోని స్టేడియంలో ఉంచనున్నారు. ఆ తర్వాత రేపు మధ్యాహ్నం మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరపనున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ కీలక నిర్ణయం తీసుకుంది. రేపు ఏపీ అంతటా ఉదయం ఆటను రద్దు చేస్తున్నట్టు థియేటర్ల యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. అలాగే రేపు మొత్తం షూటింగ్స్ కూడా లేవని నిర్మాతల మండలి నిర్ణయం తీసుకుంది. ఈ విధంగా సూపర్ స్టార్ కృష్ణకు నివాళులు అర్పించాలని నిర్ణయం తీసుకున్నారు.