Pawan Kalyan: హైదరాబాదులోని శిల్పకళావేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ చార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన సీఏ విద్యార్థుల అంతర్జాతీయ సదస్సుకు ఆయన హాజరయ్యారు. ప్రస్తుతం తాను ఒక ఫెయిల్యూర్ పొలిటీషియన్ కిందే లెక్క అని వెల్లడించారు. దాన్ని నేను అంగీకరిస్తున్నా అని చెప్పేందుకు తాను ఎంతమాత్రం మొహమాటపడనని, బాధపడనని స్పష్టం చేశారు. తన పరాజయాల గురించి ధైర్యంగా మాట్లాడగలనని అన్నారు. ఓటమి విజయానికి నాంధి అన్న విషయం మర్చిపోకూడదని తెలిపారు. గెలుపుకు పునాది వేసేది ఓటమేనని ఆయన అభిప్రాయపడ్డారు.
Valid Point 📌📌📌
I Never Went For Money – @PawanKalyan pic.twitter.com/0c54oSGdvv
— EastGodavari PawanKalyan FC™ (@PKFC_EGodavari) December 3, 2022
పేరు, డబ్బు ఉన్నవారంతా మహానుభావులు అనుకోవద్దని.. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. వ్యక్తిగత విజయమే దేశానికి పెట్టుబడి అని ఏది ఒప్పు, ఏది తప్పు అని నిర్ణయించుకోవాలని ఆయన సూచించారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ ‘ఫేసింగ్ ద ఫ్యూచర్’ అనే అంశంపై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
ఇదీ చదవండి: భయపడే ప్రసక్తే లేదు.. జైల్లో పెడతారా పెట్టుకోండి- ఎమ్మెల్సీ కవిత