Site icon Prime9

Super Star Krishna: “నాన్నకు ప్రేమతో”.. మహేష్ బాబు కీలక నిర్ణయం

mahesh-babu-and-family-members-likely to -establish-krishna-memorial-ghat

mahesh-babu-and-family-members-likely to -establish-krishna-memorial-ghat

Super Star Krishna: సినీలోకానికి అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ఆయన చేసిన ప్రయోగాత్మక చిత్రాలే మార్గనిర్ధేశాలు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. 50 ఏళ్ల క్రితమే పాన్ వరల్డ్ సినిమా తీసిన లెజెండరీ యాక్టర్ సూపర్ స్టార్ కృష్ణ. ఈయన అద్భుత నటన మరియు ఆయన వ్యక్తిత్వం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అలాంటి నటశేఖరుడు నవంబర్ 15 మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా ఒకే ఏడాదిలో ముగ్గురు కుటుంబ సభ్యులను కోల్పోయిన మహేష్ కుటుంబం తీవ్ర దుఃఖ సాగరంలో మునిగిపోయింది. మహేష్ కు ధైర్యం చెప్తూ పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఆయనను ఓదార్చారు. అయితే సూపర్‌స్టార్ కృష్ణకు ఘననివాళులర్పించేందుకు ఆయన కుటుంబసభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఆయన గుర్తుగా ఓ మెమెరియల్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు మహేష్ బాబు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఎక్కడ ఏర్పాటు చేయాలనేదానిపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారట. ఈ మెమోరియల్‌లో కృష్ణ కాంస్య విగ్రహంతో పాటు ఆయన నటించిన 350 సినిమాలకు సంబంధించిన ఫోటోలు, షీల్డ్‌లు, ఇతర వివరాలను ప్రజల సందర్శనార్థం అందుబాటులో ఉంచనున్నారు. ఇందుకోసం కృష్ణ ఘాట్ ఏర్పాటు చేసే యోచనలో కుటుంబీకులు ఉన్నట్టు టాలీవుడ్ సమాచారం. పద్మాలయ స్టూడియో వద్ద ఈ మెమోరియల్‌ను నిర్మించాలనే ఆలోచనలో మహేష్ బాబు ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలోనే కృష్ణ కుటుంబ సభ్యులు దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన చేయనున్నారని సినీవర్గాలు అంటున్నాయి.

ఇదీ చదవండి: సంచలనంగా మారిన కృష్ణ వీలునామా.. కొడుకులకు కాదని ఆస్తి అంతా వారిపేరిటే..!

Exit mobile version
Skip to toolbar