2025 TVS RONIN: బ్రహ్మాస్త్రాన్ని వదిలిన టీవీఎస్.. రాయల్ ఎన్ఫీల్డ్‌కు ఇక ముచ్చేమటలే.. రోనిన్ నయా ఎడిషన్ లాంచ్..!

2025 TVS RONIN: ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ టీవీఎస్‌కు ఇండియాలో ఎంత పెద్ద మార్కెట్ ఉందో అందరికీ తెలిసిందే. యూత్ నుంచి కుటుంబ వర్గాల వరకు అందుబాటులో ఉండే బైక్స్‌ను విడుదల చేయడంలో ఇది బాగా ప్రసిద్ది చెందిన సంస్థ. తక్కువ ధరలో అన్ని వర్గాల ప్రజలకు అవసరమయ్యే మోడళ్లను భారతీయ వినియోగదారులకు అందించడంలో టీవీఎస్ కంపెనీకి మంచి పేరుంది. దేశంలో టీవీఎస్ రోనిన్ ప్రస్తుతం అత్యంత డిమాండ్ ఉన్న మోడల్. మార్కెట్లో ఎన్నో బైక్స్ ఉన్నప్పటికీ రోనిన్‌కు ఉన్న క్రేజ్ వేరనే చెప్పాలి. కంపెనీ సైతం దీన్ని ఎప్పటికప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా అప్‌డేట్ చేస్తుంది.
కంపెనీ తాజాగా రోనిన్ 2025 ఎడిషన్‌ను విడుదల చేసింది. దీనిలో చాలా అప్‌గ్రేడ్లు చేసింది. ఇది మరింత స్టైలిష్, సురక్షితమైనదిగా చేస్తుంది. TVS కంపెనీ న్యూ రోనిన్ మోడల్ కోసం గ్లేసియర్ సిల్వర్, చార్‌కోల్ ఎంబర్ అనే రెండు కొత్త అద్భుతమైన కలర్ ఆప్షన్‌లను పరిచయం చేసింది. దీని మిడ్ వేరియంట్ ఇప్పుడు డ్యూయల్ ఛానల్ ABS, మెరుగైన బ్రేకింగ్ సిస్టమ్‌తో వస్తుంది. ఇందులో ఉండే శక్తివంతమైన ఇంజన్ , అధునాతన ఫీచర్ల కారణంగా రైడింగ్ ఇప్పుడు మరింత సరదాగా మారింది.
2025 TVS RONIN Price
కొత్త 2025 TVS RONIN మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. దీని బేస్ వేరియంట్ ధర రూ. 1.35 లక్షలు ఎక్స్-షోరూమ్. కాగా, మిడ్ వేరియంట్ ధర రూ. 1.49 లక్షల ఎక్స్-షోరూమ్. ఇది కాకుండా, టాప్ వేరియంట్ ధర రూ. 1.59 లక్షలు ఎక్స్-షోరూమ్.
2025 TVS RONIN Engine
ఈ బైక్‌లో 225.9cc, సింగిల్-సిలిండర్, ఆయిల్-కూల్డ్ ఇంజన్ అందించారు. ఈ ఇంజన్ 7,750 ఆర్‌పిఎమ్ వద్ద 20.4పిఎస్ పవర్, 3,750 ఆర్‌పిఎమ్ వద్ద 19.93 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇందులో 5-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ కనిపిస్తుంది. ఇది గ్లైడ్ త్రూ టెక్నాలజీతో వస్తుంది. ఈ టెక్ ట్రాఫిక్‌లో కుదుపు లేకుండా స్మూత్ రైడింగ్ అనుభవాన్ని ఇస్తుంది.
2025 TVS RONIN Safety Features
భద్రత విషయానికి వస్తే.. ఇప్పుడు డ్యూయల్ ఛానెల్ ABS ఉంటుంది. ఇది మెరుగైన బ్రేకింగ్ కంట్రోల్ అందిస్తుంది. ఈ బైక్‌లో స్లిప్పర్ క్లచ్, అసిస్ట్ క్లచ్ ఉన్నాయి. అద్భుతమైన స్థిరత్వం, నిర్వహణ కోసం కంపెనీ దానిలో USD ఫ్రంట్ ఫోర్క్‌లు అందించింది. ఇది కాకుండా ఫుల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అందుబాటులో ఉంది, బ్లూటూత్ కనెక్టివిటీతో వస్తుంది.