Last Updated:

2025 Honda Shine 125: మరింత కొత్తగా వచ్చేసిన హోండా షైన్.. ఈసారి ఏం మారిందో తెలుసా..? ధర చాలా తక్కువ..!

2025 Honda Shine 125: మరింత కొత్తగా వచ్చేసిన హోండా షైన్.. ఈసారి ఏం మారిందో తెలుసా..? ధర చాలా తక్కువ..!

2025 Honda Shine 125: ప్రముఖ టూవీలర్ తయారీ సంస్థ హోండా దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో స్కూటర్, బైక్స్ విభాగంలో అగ్రస్థానంలో ఉంది. ఈ కంపెనీకి చెందిన టూవీలర్లు రోడ్లపై ఎక్కువగా కనిపిస్తుంటాయి. సాధరణంగా దేశంలో మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉంటారు. వీరంగా ఎక్కువ డబ్బులు ఖర్చు చేసి ద్విచక్రవాహనాలను కొనలేరు. ఈ పరిస్థితుల్లో హోండా టూవీలర్స్‌ను ఎంచుకుంటారు.

హెండాకి చెందిన బైకులు తక్కువ ధరలో లభించడమే కాకుండా ఎక్కువ మైలేజ్ ఇస్తాయి. ఈ క్రమంలో కంపెనీ ఇటీవల 2025 షైన్ 125 బైక్‌ను గ్రాండ్‌గా సేల్‌కి తీసుకొచ్చింది. ఈ మోటార్‌సైకిల్ ఆకర్షణీయమైన డిజైన్, ఫీచర్లను కలిగి ఉంది, అలానే అందుబాటు ధరలో విడుదలైంది. రండి.. కొత్త హోండా షైన్ 125 బైక్ విశేషాలను తెలుసుకుందాం.

సరికొత్త హోండా షైన్ 125 బైక్ బడ్జెట్ ధరలో విడదలైంది. దీని ధర రూ.84,493 ఎక్స్-షోరూమ్. ఇది డ్రమ్ బ్రేక్ , డిస్క్ బ్రేక్ అనే రెండు ఆకర్షణీయమైన వేరియంట్లలో కూడా అందుబాటులో ఉంటుంది. ఈ మోటార్‌సైకిల్ పాత ‘షైన్’ బైక్ మాదిరిగానే డిజైన్‌ను కలిగి ఉంది. పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, జెనీ గ్రే మెటాలిక్, మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్, డిసెంట్ బ్లూ మెటాలిక్, పెర్ల్ సైరన్ బ్లూతో సహా 6 రంగులలో అందుబాటులో ఉంది.

ఈ బైక్‌లో శక్తివంతమైన 123.94 cc పెట్రోల్ ఇంజన్ ఉంది. దీన్ని OBD2B ప్రమాణాలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేశారు. ఇది 10.63 బిహెచ్‌పి హార్స్ పవర్, 11 ఎన్ఎమ్ పవర్ ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ని కలిగి ఉంటుంది. బైక్ 55 kmpl వరకు మైలేజీని ఇస్తుంది. బైక్‌లో ఫుల్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ ఉంది. ఇది రియల్ టైమ్ మైలేజీతో సహా చాలా సమాచారాన్ని అందిస్తుంది. ఇది USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్‌ను పొందుతుంది.

ఈ బైక్ బరువు 123 కిలోలు, 10.5 లీటర్ కెపాసిటి గల ఫ్యూయల్ ట్యాంక్ ఉంది. ఈ బైక్ ఫ్రంట్ టెలిస్కోపిక్ ఫోర్క్స్, రియర్ డ్యూయల్ రేర్ స్ప్రింగ్స్ సస్పెన్షన్ సెటప్ ఆప్షన్‌తో ఫ్రంట్ డ్రమ్/డిస్క్, రియర్ డ్రమ్ బ్రేక్‌తో వస్తుంది. హోండా షైన్ 125 ధర రూ.88,012 ఎక్స్-షోరూమ్. అదేవిధంగా మార్కెట్లో ఈ బైక్‌కి పోటీగా నిలిస్తున్న టీవీఎస్ రైడర్ 125 మోటార్‌సైకిల్ ఎక్స్-షోరూమ్ ధర రూ.89,990 నుండి రూ.1.10 లక్షల వరకు ఉంది.