Bajaj Freedom 150 CNG Launch Soon: బజాజ్ మరో సంచలనం.. 150సీసీతో వస్తున్న ఫ్రీడమ్ సీఎన్‌జీ.. ఈసారి మైలేజ్ ఎంతంటే..?

Bajaj Freedom 150 CNG Launch Soon: బజాజ్ ఆటో తన మొదటి CNG బైక్ ఫ్రీడమ్ 125 ను గత సంవత్సరం మార్కెట్లో లాంచ్ చేసింది. ఇప్పుడు కంపెనీ మరో కొత్త CNG బైక్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలో ఈ కొత్త మోడల్‌ను మార్కెట్‌లోకి విడుదల చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. మీడియా కథనాల ప్రకారం.. కొత్త బైక్ పేరు ఫ్రీడమ్ 150 కావచ్చు. ఇది పల్సర్ 150 వలె అదే ఇంజన్‌తో వచ్చే అవకాశం ఉంది. ఇక ఫ్రీడమ్ 125 గురించి మాట్లాడుకుంటే ఈ బైక్ వచ్చి దాదాపు 8 నెలలైంది. ఇప్పటి వరకు 50 వేలకు పైగా యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇప్పుడు బజాజ్ తన CNG పోర్ట్‌ఫోలియోను పెంచడానికి సిద్ధమవుతోంది.
మీడియా నివేదికల ప్రకారం.. బజాజ్ ఆటో కొత్త CNG ఇప్పుడు 150cc ఇంజన్‌లో వస్తుంది. దీని ధర కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. బజాజ్ CNG బైక్ మరింత శక్తివంతమైన బైక్‌లను నడపాలనుకునే వినియోగదారులకు మంచి ఎంపికగా నిరూపిస్తుంది. ఇప్పుడు ఫ్రీడమ్ 125లో మరో వేరియంట్‌ను చేర్చబోతున్నారు.
కొత్త మోడల్‌ను వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల చేయవచ్చు. కొత్త మోడల్‌లో భద్రతకు కూడా పూర్తి జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఈ బైక్‌లో డ్రమ్, డిస్క్ బ్రేక్‌ల సౌకర్యం ఉంటుంది. 150సీసీ సీఎన్ జీ బైక్ రావచ్చు.
బజాజ్ కొత్త 150సీసీ సిఎన్‌జి బైక్ డిజైన్‌కు సంబంధించి నిర్దిష్ట సమాచారం వెల్లడి కాలేదు, అయితే కొత్త మోడల్ డిజైన్ ప్రస్తుత మోడల్‌ను పోలి ఉండవచ్చని భావిస్తున్నారు. ఇందులో కొత్త గ్రాఫిక్స్‌ను చూడచ్చు. బజాజ్ ఫ్రీడమ్‌లో 125cc సింగిల్-సిలిండర్ ఇంజన్ ఉంది, ఇది పెట్రోల్, CNG రెండింటిలోనూ నడుస్తుంది.
ఈ ఇంజన్ 9.5 పిఎస్ పవర్, 9.7 ఎన్ఎమ్ టార్క్ ఇస్తుంది. 2KG CNG సిలిండర్, 2 లీటర్ పెట్రోల్ ట్యాంక్ కలిగి ఉండటం వల్ల స్థల సమస్య ఉండదు. బైక్ ఎత్తు 785మిమీ, కాబట్టి ఈ బైక్‌పై ఇద్దరు వ్యక్తులు సౌకర్యవంతంగా కూర్చోచ్చు. కొత్త మోడల్‌లో పొడవైన సీటును కూడా అందించాలని భావిస్తున్నారు.